బి. సుమీత్ రెడ్డి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మనామం | Sumeeth Reddy Buss |
జననం | [1] గుంగల్ | 1991 సెప్టెంబరు 26
నివాసము | తెలంగాణ |
దేశం | భారతదేశం |
వాటం | కుడిచేతి |
పురుషుల డబుల్స్ | |
అత్యున్నత స్థానం | 17 (12/31/2015) |
ప్రస్తుత స్థానం | 19 (4/28/2016) |
BWF profile |
బి. సుమీత్ రెడ్డి తెలంగాణా ప్రాంతానికి చెందిన బ్యాడ్‌మింటన్ క్రీడాకారుడు. ఇతడు రంగారెడ్డి జిల్లా గుంగుల్ లో 1991,సెప్టెంబర్ 26 న జన్మించాడు. ఇతడు 2001లో తన 15వ యేట బ్యాడ్మింటన్ క్రీడ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ఇతడు 2007లో తొలిసారిగా ఆసియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశించాడు. మొదట ఇతడు సింగిల్స్ మాత్రమే ఆడినా గాయం కారణంగా డబుల్స్‌లో ప్రవేశించి రాణించాడు.[2] మొదట ఇతని జోడీ టి.హేమనాగేంద్ర బాబు కాగా ప్రస్తుతం మను అత్రి ఇతని జంటగా ఉన్నాడు.ఇతడు 2014 ఆసియా క్రీడలలో పాల్గొన్నాడు. 2016 ఆగష్టు నుండి ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టులో ఉన్నాడు.
విభాగం | ఆడినవి | గెలిచినవి | ఓడినవి |
---|---|---|---|
సింగిల్స్ | 16 | 9 | 7 |
డబుల్స్ | 159 | 87 | 72 |
మిక్స్‌డ్ డబుల్స్ | 2 | 0 | 2 |
క్ర.సం | సంవత్సరం | టోర్నమెంట్ | విభాగం | భాగస్వామి |
---|---|---|---|---|
1 | 2013 | టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ [3] | పురుషుల డబుల్స్ | మను అత్రి |
2 | 2014 | టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ [4] | పురుషుల డబుల్స్ | మను అత్రి |
3 | 2015 | లాగోస్ ఇంటర్నేషనల్ 2015[5] | పురుషుల డబుల్స్ | మను అత్రి |
2019 ఫిబ్రవరిలో తన తోటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డితో సుమీత్ రెడ్డి వివాహం జరిగింది.[6][7]
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)