భాగీరథీ దేవి | |
---|---|
బీహార్ శాసనసభ్యురాలు | |
In office 2010 | |
అంతకు ముందు వారు | చంద్రమోహన్ రాయ్ |
నియోజకవర్గం | రామ్‌నగర్, పశ్చిమ చంపారన్ శాసనసభ నియోజకవర్గం |
In office 2000–2010 | |
అంతకు ముందు వారు | భొలారామ్ తూఫానీ |
తరువాత వారు | నియోజకవర్గం రద్దైంది |
నియోజకవర్గం | షికార్‌పూర్, బీహార్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | నర్కటియాగంజ్, పశ్చిమ చంపారన్ జిల్లా, బీహార్ | 12 జనవరి 1954
జాతీయత | భారతీయులు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | మామీఖాన్ రౌత్ |
సంతానం | 6 |
నివాసం | స్కిఆర్పూర్, పశ్చిమ చంపారన్ జిల్లా, బీహార్ |
వృత్తి | రాజకీయవేత్త సామాజిక కార్యకర్త |
భాగీరథీ దేవి (జననం 1954 జనవరి 12) బీహార్‌కు చెందిన రాజకీయవేత్త. ఆమె బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యురాలు. పశ్చిమ చంపారన్ జిల్లా లోని రామ్‌నగర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది.[1][2] భాగీరిథీ దేవి మొదట్లో ₹800 (US$10) జీతంతో పశ్చిమ చంపారన్ జిల్లా, నర్కటియాగంజ్‌లోని బ్లాక్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేసేది.
ఆమె బీహార్‌లోని నర్కటియాగంజ్‌కు చెందిన మహాదళిత్ కుటుంబానికి చెందినది. 2015 బీహార్ శాసనసభ ఎన్నికల్లో భాగీరథి మళ్లీ రాంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై పోటీ చేసి విజయం సాధించింది.[3][4][5][6] 2015 ఏప్రిల్‌లో MGNREGA పథకం కింద వేతనాలు చెల్లించకపోవడంపై బీహార్ శాసనసభలో జీరో అవర్‌లో అధికార జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన అన్నూ శుక్లాతో భాగీరథీ దేవి వాగ్వాదం జరిపింది.[7] 2000, 2005 ఎన్నికలలో ఇప్పుడు రద్దైన షికార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో గెలిచింది. ఆమె రైల్వే ఉద్యోగి మామిఖాన్ రౌత్‌ను వివాహం చేసుకుంది.
2019 లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.[8]
భాగీరథి పశ్చిమ చంపారన్ జిల్లాలోని తన ఇంటిని అంగన్‌వాడీ కేంద్రం (బాల సంరక్షణ కేంద్రాలు) కోసం ఇచ్చింది. ముఖ్యంగా బాలికల విద్యారంగంలో ఆమె కృషి చేసింది. భగీరథి నర్కటియాగంజ్ బ్లాక్‌లో మహిళా సంఘాలను స్థాపించడం, మహిళలను సమీకరించడం, గృహ హింస, దళితులపై హింస, న్యాయమైన వేతనాలు వంటి సమస్యలపై అవగాహన కల్పించడం వంటి కృషిలో అనేక సంవత్సరాల పాటు నిమగ్నమైంది. తరువాత ఆమె తన రాజకీయ కార్యాచరణను జిల్లాలోని ఇతర బ్లాకులకు విస్తరించింది. 1991 లో ప్రదర్శనలు నిర్వహించినందుకు జైలుకు వెళ్ళింది.