సంకేతాక్షరం | NHAI |
---|---|
స్థాపన | 1988 |
రకం | స్వతంత్ర సంస్థ |
చట్టబద్ధత | ఉంది |
కేంద్రీకరణ | జాతీయ రహదారులు అభివృద్ధి, నిర్వహణ |
ప్రధాన కార్యాలయాలు | G 5&6 |
కార్యస్థానం |
|
భౌగోళికాంశాలు | 28°35′01″N 77°03′28″E / 28.583689°N 77.057886°E |
సేవా ప్రాంతాలు | India |
Chairman | Deepak Kumar, IAS[1] |
ప్రధానభాగం | Board of directors[2] |
మాతృ సంస్థ | కేంద్ర రోడ్డు రవాణా, ప్రధాన రహదారులు మంత్రిత్వ శాఖ |
జాలగూడు | www.nhai.gov.in |
భారత జాతీయ రహదారుల అధికార సంస్థ భారత ప్రభుత్వ ఆద్వర్యంలో నిర్వహింపబడుతున్న ఒక స్వతంత్ర సంస్థ. ఇది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు ఒక నోడల్ సంస్థగా వ్యవహరిస్తుంది. భారతదేశంలో ప్రధాన నగరాలు, రాష్టాల రాజధానులు, ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలు, రేవు పట్టణాలను కలుపుతూ నిర్మించిన 50,000 కిలోమీటర్ల పైచిలుకు రహదారుల నిర్మాణ, నిర్వహణకు ఇది బాధ్యత వహిస్తుంది.
భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థను భారత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో "భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ చట్టం 1988" ప్రకారం ఏర్పాటుచేసింది.ఈ సంస్థ ద్వారా జాతీయ రహదారుల నిర్వహణ, యాజమాన్య భద్యతలను నిర్వహింబడేల చట్టాన్ని రూపొందించడం జరిగింది.1995 లో దీనిని ఒక స్వతంత్ర సంస్థగా రూపొందించడం జరిగింది.జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ టోల్ గేట్ల వద్ద వసులు చేయు సొమ్ముకు బాధ్యత వహిస్తుంది.
భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ "జాతీయ రహదారుల అభివృద్ధి పధకం" అమలులో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది."జాతీయ రహదారుల అభివృద్ధి పధకం"లో దశలు[4]
2000 వ సంవత్సరంలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆమోదించారు. ఈ పధకంలో స్వర్ణ చతుర్భుజి", "ఉత్తర-దక్షిణ", "తూర్పు-పడమర" కారిడార్లను అభివృద్ధి చేయడం ప్రధ్హన రేవు పట్టణాలను అనుసంధానించడం. ఈ దశ నిర్వాహణకు సుమారు 30000 కోట్ల రూపాయిలను కేటాయించడం జరిగింది.
ఈ దశను 2003 డిసెంబరులో అమోదించడం జరిగింది. "ఉత్తర-దక్షిణ", "తూర్పు-పడమర" కారిడార్లను పూర్తి చేయడంతో పాటు, మరో 486 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను విస్తరించడం ఈ దశ లక్ష్యాలు.దీని కొరకు 34300కోట్ల రూపాయిలను కేటాయించారు.
ఈ దశను 2005 లో అమోదించడం జరిగింది.సుమారు 22200 కోట్ల రుపాయిల వ్యయంతో 4,035 కిలో మీటర్ల జాతీయ రహదారులను 4 వరుసల రహదారులుగా విస్తరించడం దీని లక్ష్యం .
2006 ఏప్రిల్ లో ఈ దశను ఆమోదించడం జరిగింది.54300 కోట్ల రుపాయిల వ్యయంతో 8,074 కిలో మీటర్ల పొడవైన రెండు వరుసల జాతీయ రహదారులను 4 వరుసలుగా అభివృద్ధి చేయడం.
2006 అక్టోబరులో దీనికి ఆమోదం లభించింది.స్వర్ణ చతుర్భుజి" రహదారులను 6 వరుసల రహదారులుగా విస్తరించడం.
1000 కిలో మీటర్ల ఎక్స్‌ప్రెస్ మార్గాలను 16700 కోట్ల రుపాయిల వ్యయంతో అభివృద్ధి చేయడం.
నగరాల్లో రద్ధిని తగ్గించడానికి రింగ్ రోడ్లు,ఫ్లై ఓవర్లు,బై పాస్ రోడ్ల నిర్మాణాలను నిర్మించడం.దీనికి 2007 డిసెంబరు లో 16700 కోట్ల రూపాయిల వ్యయం కు ఆమోదం లభించింది.
భారతదేశంలో గల ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కాతా, చెన్నై లను మిగతా ప్రధాన రేవు పట్టణాలతో,ప్రధాన వాణిజ్య కేంద్రాలతో, పారిశ్రామిక ప్రాంతాలతోను అనుసంధానం చేయడానికి దీనిని ప్రారంభించారు.2001 లో ప్రారంభింపబడిన ఈ ప్రాజక్టూ ప్రపంచంలో అనాటికి నిర్మింపబడ్డ అతిపెద్ద రోడ్డు అనుసంధానాలలో ఐదవది.2001 లో ఇది ప్రారంభింపబడి, 2012లో పూర్తైంది.
భారతదేశ తూర్పు భాగంలో గల సిల్చేర్ నుండి,పడమర భారతంలో గల పోర్‌బందర్ వరకు ,ఉత్తర భారతదేశం లో గల శ్రీనగర్ నుండి ,దక్షిణ భారతదేశం లో గల కన్యా కుమారి వరకు గల జాతీయ రహదారులను 4లేదా6 వరుసల రహదారులుగా విస్తరించడం దీని లక్ష్యం.
దశ | వివరాలు | పొడవు | నిర్మాణ వ్యయం ₹ ( in cr) |
---|---|---|---|
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం-I & II దశలు | స్వర్ణ చతుర్భుజి", "ఉత్తర-దక్షిణ", "తూర్పు-పడమర" కారిడార్లను పూర్తి చేయడం | 13,000 కి.మీ. (8,100 మై.) | 42,000 |
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం-III దశ | 4-వరసలు | 10,000 కి.మీ. (6,200 మై.) | 55,000 |
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం--IV దశ | 2-వరుసల | 20,000 కి.మీ. (12,000 మై.) | 25,000 |
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం--V దశ | 6-వరుసల రోడ్డు మర్గాలు (ఏంపిక చేయబడ్డ ప్రాంతాల్లో) | 5,000 కి.మీ. (3,100 మై.) | 17,500 |
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం--VI దశ | ఎక్స్‌ప్రెస్ మార్గాలను అభివృద్ధి చేయడం | 1,000 కి.మీ. (620 మై.) | 15,000 |
జాతీయ రహదారుల అభివృద్ధి పధకం-VII దశ | రింగు రోడ్లు, బై-పాస్ రోడ్లు ఏర్పాటు చేయడం | 700 కి.మీ. (430 మై.) | 15,000 |
మొత్తం | 45,000 కి.మీ. (28,000 మై.) | 1,69,500 (Revised to 2,20,000) |
Priority | జాతీయ రహదారుల అభివృద్ధి పధకం దశ | పొడవు (km) | స్థితి | ఆమోదం | పూర్తికావలిసిన సంవత్సరం |
---|---|---|---|---|---|
1 | మొదటి దశ | 5,846 కి.మీ. (3,633 మై.) | పూర్తి కాబడింది | 2000 డిసెంబరు | 2006 డిసెంబరు |
2 | రెండవ దశ | 7,300 కి.మీ. (4,500 మై.) | నిర్మాణ దశలో కలదు | 2003 డిసెంబరు | 2009 డిసెంబరు |
3 | మూడవ (A) | 4,000 కి.మీ. (2,500 మై.) | మొదలు కాబడింది | 2005 మార్చి | 2009 డిసెంబరు |
4 | అయిదవ దశ | 6,500 కి.మీ. (4,000 మై.) | 5700 km స్వర్ణ చతుర్భుజి " + 800 km"తూర్పు-పడమర" కారిడార్లు మొదలు కాబడినవి | 2005 నవంబరు | 2012 డిసెంబరు |
5 | మూడవ (B) | 6,000 కి.మీ. (3,700 మై.) | మార్గాలు ఎంపిక కాబడినవి | 2006 మార్చి | 2012 డిసెంబరు |
6 | ఏడవ దశ (A) | 700 కి.మీ. (430 మై.) | మార్గాలు ఎంపిక కాబడినవి | 2006 డిసెంబరు | 2012 డిసెంబరు |
7 | నాల్గవ దశ (A) | 5,000 కి.మీ. (3,100 మై.) | మార్గాలు ఎంపిక కాబడినవి | 2006 డిసెంబరు | 2012 డిసెంబరు |
8 | ఏడవ దశ (B) | మార్గాలు ఎంపిక కాబడినవి | 2007 డిసెంబరు | 2013 డిసెంబరు | |
9 | నాల్గవ దశ (B) | 5,000 కి.మీ. (3,100 మై.) | మార్గాలు ఎంపిక కాబడినవి | 2007 డిసెంబరు | 2013 డిసెంబరు |
10 | ఆరవ దశ (A) | 400 కి.మీ. (250 మై.) | మార్గాలు ఎంపిక కాబడినవి | 2007 డిసెంబరు | 2014 డిసెంబరు |
11 | ఏడవ దశ (C) | మార్గాలు ఎంపిక కాబడినవి | December 2008 | December 2014 | |
12 | నాల్గవ దశ (C) | 5,000 కి.మీ. (3,100 మై.) | మార్గాలు ఎంపిక కాబడినవి | 2008 డిసెంబరు | 2014 డిసెంబరు |
13 | ఆరవ దశ (B) | 600 కి.మీ. (370 మై.) | మార్గాలు ఎంపిక కాబడినవి | 2008 డిసెంబరు | 2015 డిసెంబరు |
14 | నాల్గవ దశ (D) | 5,000 కి.మీ. (3,100 మై.) | మార్గాలు ఎంపిక కాబడినవి | 2009 డిసెంబరు | 2015 డిసెంబరు |