భారత డిజిటల్ లైబ్రరీ (Digital Library of India) [1][2] [3] ప్రాజెక్టులో మనదేశములోని వివిధ భాషలలోని పుస్తకాలను డిజిటల్ రూపంలోకి మార్చి అంతర్జాలం ద్వారా ఎవరైనా చదివే లేక పొందే ఏర్పాటు కలది. ఈ ప్రాజెక్టు సార్పత్రిక డిజిటల్ లైబ్రరీలో భాగంగా చేపట్టబడింది. భారత డిజిటల్ లైబ్రరీప్రాజెక్టులో భాగంగా, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయం లోని ఎంపిక చేసిన పుస్తకాలను[4] స్కానింగు చేసి అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయం తరపున 14,343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.జులై 2012 నాటికే మొత్తం భాగస్వామ్యాలద్వారా 23361 పైగా తెలుగు పుస్తకాలు 4,480,653 మొత్తం పేజీలతో డిజిటల్ రూపంలో (బొమ్మ) అందుబాటులో ఉన్నాయి. అన్ని భాషలలో కలిపి 3,47,462 పుస్తకాలు, 123,390,315 మొత్తం పేజీలు డిజిటైజ్ చేయబడ్డాయి..[5] పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో డిజిటల్ లైబ్రరీ ఫథకాలకు 70కోట్ల రూపాయల ప్రణాళిక తయారుచేయబడింది.[6]
వెబ్సైట్ లో చదువుటకు టిఫ్ (TIFF) బొమ్మలు చూపెట్టగలిగే ఉపకరణము, మీ విహరిణిలో స్థాపించుకోవాలి. ఇంటర్నెట్ ఎక్సోప్లోరర్ వాడితే ఆల్టెర్నాటిఫ్ (alternatiff) వాడాలి. లినక్స్ ఫైర్‌ఫాక్స్ వాడుకరులు, మొజ్‌ప్లగ్గర్ (mozplugger) పొడిగింతను స్థాపించుకోవాలి. ఫైర్పాక్స్ (3.6.3) లో ఒక పేజి చూపించే లింకు మాత్రమే పనిచేస్తున్నది. పేజీలు తిప్పడానికి, క్రింద వున్న వచ్చే ప్రేమ్లో క్రిందదాక పోవాలి ( పేజీ డౌన్ చేయాలి).
డిఎల్ఐ వెబ్సైటు ఆగష్టు 2017 నుండి కొంతమంది కాపీరైట్ అభ్యంతరాలవలన ఆపివేయబడినా,[7] చాలా పుస్తకాలు ఆర్కైవ్. ఆర్గ్ లో నవంబర్ 2016 నుండి అందుబాటులో ఉన్నాయి[8].[9] వీరి పుస్తకపు పేజీలను చూపించే సాఫ్ట్వేర్ వాడుకరులకు సులభంగా, అన్ని విహరిణులలో పనిచేస్తుంది. 'నడుపు' బొత్తాము నొక్కితే, పేజీలు స్వయంచాలకంగా తిప్పబడతాయి.
ఏప్రిల్ 2012 లో ఐఐఎస్సి నిర్వహించే సైటులో నెలరోజుల గణాంకాలను పరిశీలించితే [10] అన్ని భాషల పుస్తకాలమొత్తానికి సగటు గణాంకాలు ఇలా ఉన్నాయి.