Madanavarman | |
---|---|
King of Jejakabhukti | |
పరిపాలన | c. 1128–1165 CE |
పూర్వాధికారి | Prithvivarman |
ఉత్తరాధికారి | Yashovarman II or Paramardi |
వంశము | Yashovarman |
రాజవంశం | Chandela |
తండ్రి | Prithvivarman |
మదన-వర్మ (సా.శ 1128–1165) భారతదేశంలోని చందేలా రాజవంశానికి చెందిన రాజు. ఆయన తన తండ్రి పృథ్వీ-వర్మ తరువాత జెజకభూక్తి ప్రాంతానికి (ప్రస్తుత మధ్యప్రదేశు, ఉత్తర ప్రదేశులోని బుందేలుఖండు) పాలకుడిగా అధికారపీఠం అధిష్ఠించాడు. ఆయన పొరుగు రాజ్యాలను లొంగదీసుకోవడం ద్వారా చందేలా కీర్తిని పునరుద్ధరించాడు. ఆయన తన పాలనలో అనేక దేవాలయాలను నిర్మించాడు.
మదనవర్మన వారసుల శాసనాలు సాంప్రదాయిక ప్రశంశల ఆధారంగా ఆయన సైనిక విజయాలు నిర్ణయించబడినప్పటికీ అవి నిర్దిష్ట వివరాలను అందించవు. దేవతా యోధుడైన ఇంద్రుడు పర్వతాల రెక్కలను నరికి వాలా రాక్షసుడిని చంపినట్లే మదనవర్మ తన శత్రువులను తన కత్తితో చెదరగొట్టాడని పరమార్ది బాఘారీ శాసనం అతిశయోక్తులు పలుకుతుంది. రాహువు కొత్తగా పుట్టుకొచ్చి సూర్యుడితో సంబంధంలోకి వచ్చినట్లే అతని శత్రువులు తమ వినాశనం వైపు వేగంగా కదులుతున్నప్పుడు ఆయన ఎర్రని ఖడ్గాన్ని చూశారని ఇది పేర్కొంది. ఇది తన శత్రువుల భార్యల దయనీయ స్థితిని కూడా వివరిస్తుంది. ఎందుకంటే వారి భర్తలు యుద్ధభూమి నుండి తిరిగి వస్తారనే ఆశతో వారు తమ పెంపుడు చిలుకలతో కన్నీటితో మాట్లాడుతుంటారు. [1]
మదనవర్మ మంత్రి గదాధర మౌ శాసనం చందేలా రాజు మిగతా రాజులందరినీ లొంగదీసుకోవడానికి మంత్రి సహాయపడ్డారని పేర్కొంది. [2] చేది రాజు మదనవర్మ పేరు వినగానే పారిపోయాడని, కాశీ రాజు భయంతో ఆయనతో స్నేహంగా ఉండిపోయాడని, అహంకారి మాళవ రాజు త్వరగా నిర్మూలించబడ్డాడని, ఇతర రాజులు ఆయనకు నివాళులర్పించి ఆధిపత్యాన్ని అంగీకరించారని ఇందులో పేర్కొనబడింది. ఇవి ఆస్థానకవి అతిశయోక్తి అయినప్పటికీ మదనవర్మ ఈ పాలకుల మీద రాజకీయ ప్రభావాన్ని చూపగలిగాడని తెలుస్తుంది.[3]
ఆయన నాణేలు బధ్రపరచిన పేటిక ఆధారంగా ఇది సూచించబడింది.[4] గయాకర్ణ వారసుడు నరసింహ శాసనాలు ఈ ప్రాంతంలో లాలు పహాది (సా.శ. 1158), అల్హాఘాటు (సా.శ. 1159) వద్ద కనుగొనబడ్డాయి. చందేలాలు ఈ భూభాగాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేదని ఇది సూచిస్తుంది.[5]
[4] సా.శ1134 అగసి శాసనం ఆధారంగా మదనవర్మ భైల్లస్వామి (భిల్సా లేదా విదిషా) వద్ద నివసిస్తున్నాడు. ఆయన రాజ్యానికి చందేలా-పరమారా సరిహద్దుగా ఉన్నాయి. ఆయన వారసుడు పరమార్ది సెమ్రా శాసనం కూడా చందేలాలు బెట్వా నదిని దాటి పరమారా భూభాగంలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సూచిస్తుంది.[3] 1200 VS (1143-44 CE) శాసనం సూచించినట్లు ఈ ప్రాంతాన్ని యశోవర్మ కుమారుడు లక్ష్మివర్మ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.[5]
కృష్ణుడు కంశుడిని ఓడించినట్లే మదనవర్మ గుర్జరారాజును క్షణంలో ఓడించాడని కలంజర శాసనం పేర్కొంది. ఇక్కడ గుర్జరా గుజరాతును సూచిస్తుంది. దాని గుజరాతు రాజు చాళుక్య పాలకుడు జయసింహ సిద్ధరాజగా గుర్తించబడ్డాడు. చాళుక్య, చందేల రాజ్యాలను పరమరా భూభాగం వేరు చేస్తుంది. జయసింహ పరమరాలను ఓడించిన తరువాత రెండు శక్తుల మధ్య సంఘర్షణ అధికరించింది. [7]
చాళుక్య పాలకుడి ఓటమి గురించి "చందు బర్దై"కి చెందిన పృథ్వీరాజు రాసో ప్రస్తావించాడు. ఇది కలంజర శాసనంలో చేసిన వాదనను ధృవీకరిస్తుంది. అయితే ఈ సంఘర్షణలో విజయం సాధించినది జయసింహ మాత్రమే అని గుజరాతు కథనాలు వివరిస్తున్నాయి. కుమారపాల-చరిత ఆధారంగా జయసింహ మహోబా రాజును (అంటే మదనవర్మ) ఓడించాడు. ధారా (పరమారా రాజు) పాలకుడి విధిని చూసిన తరువాత మదనవర్మ జయసింహకు కప్పం అర్పించాడని కీర్తి-కౌముది పేర్కొంది.[7]
కుమారపాల-ప్రబంధ ఇదే విధమైన పురాణాన్ని వివరిస్తుంది: చందేల రాజు చాలా తెలివైన, ఉదార, వినోదాన్ని ఇష్టపడే పాలకుడు అని, ఆయన రాజాస్థానం జయసింహ రాజాస్థానం పోలినట్లు అద్భుతంగా ఉండేదని ఒక కవిగాయకుడు ఒకసారి జయసింహతో చెప్పాడు. ఇది విన్న జయసింహ ఈ వాదనను ధృవీకరించడానికి మరొక వ్యక్తిని నియమించారు. దావా ధృవీకరించబడినప్పుడు ఆయన చందేలాకు వ్యతిరేకంగా సైన్యాలను నడిపించాడు. మహోబా శివార్లకు చేరుకున్న తరువాత ఆయన మదనవర్మను లొంగిపోవాలని కోరుతూ ఒక దూతను పంపాడు. ఆసమయంలో మదనవర్మ వసంత పండుగను జరుపుకోవడంలో హడావిడిలో ఉండి నిర్బంధాన్ని తీవ్రంగా పరిగణించలేదు. పరమరాలు విధి గురించి దూత తనకు గుర్తుచేసినప్పుడు, జయసింహకు కొంత డబ్బు చెల్లించి తిరిగి రావాలని ఆయన తన మంత్రితో అపహాస్యం చేశాడు. జయసింహ డబ్బు అందుకున్నప్పటికీ మదనవర్మ గురించి విన్నతరువాత చందేలా రాజును కలవకుండా తిరిగి రావడానికి నిరాకరించాడు. ఆయన పెద్ద పరివారంతో చందేలా రాజభవనం సందర్శించాడు. రాజభవనం లోపల ఆయనతో పాటు ఆయన పరిచారకులలో నలుగురు మాత్రమే అనుమతించబడ్డారు. మదనవర్మ ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. పర్యవసానంగా జయసింహ తన రాజధానికి శాంతియుతంగా తిరిగి వచ్చాడు.[8]
కె.ఎం. మున్షి అభిప్రాయం ఆధారంగా పైన పేర్కొన్న పురాణం "ఊహాజనితం" అని భావిస్తున్నారు. జయసింహ చందేలకు వ్యతిరేకంగా పెద్ద విజయాన్ని సాధించలేదు. [8] చరిత్రకారుడు ఆర్. కె. దీక్షితు జయసింహ, మదనవర్మ మధ్య వివాదం అసంపూర్తిగా ఉందని, ఇరుపక్షాలు విజయం సాధించాయని సిద్ధాంతీకరించారు.[7]
A fragmentary Mahoba inscription dated 1240 VS (1183-84 CE) contains a vague reference to wars with Anga, Vanga and Kalinga. These probably refer to Madanavarman's campaign in eastern India.[5]
ఇతర చందేలా పాలకులతో పోలిస్తే ఆయన పాలన నుండి అసాధారణంగా పెద్ద సంఖ్యలో నాణేలు, శాసనాలు అందుబాటులో ఉన్నాయి. [9] వివిధ శాసనాలలో పేర్కొన్న స్థలాల పేర్లు మదనవర్మ రాజ్యం పశ్చిమాన కైమూరు పర్వతశ్రేణి నుండి తూర్పున భన్రేరు పర్వతశ్రేణి వరకు, బెట్వా, యమునా నదుల మధ్య వింధ్యపర్వత ప్రాంతం మద్య విస్తరించింది. [10][11]
ఆయన పాలనలోని శాసనాలు అగసి (బండా జిల్లా), అజయగడ్ బారిగరు (చార్ఖారీ సమీపంలో), కలంజారా, ఖాజురాహో, మహోబా, మౌ, పాపౌరా (టికాంగడ్ జిల్లా) వద్ద కనుగొనబడ్డాయి. అగసి రాగి ఫలక శాసనం భిల్సా (విదిషా) వద్ద జారీ చేయబడిందని పేర్కొంది. ఈ శాసనాలు భిల్సా కూడా తన రాజ్యంలో ఒక భాగమని సూచిస్తున్నాయి. బారిగారు (వరిదుర్గా) శాసనం అనేక ప్రదేశాలను ప్రస్తుత డామో, ఝాన్సీ, సాగరు జిల్లాల కొన్ని భాగాలలో గుర్తించవచ్చు. రేవా జిల్లాలోని పన్వరు వద్ద దొరికిన ఒక నాణేల పేటిక బాగెల్ఖండు ప్రాంతం కూడా ఆయన రాజ్యంలో ఒక భాగమని సూచిస్తుంది.[11]
మదనవర్మ ప్రధాని గదాధర, ఆయన తండ్రికి కూడా సేవ చేశారు. గదాధరకు వేదాల పరిజ్ఞానం, విష్ణు దేవాలయ నిర్మాణం డెడ్డూ గ్రామానికి సమీపంలో ఒక చెరువు నిర్మాణంతో సహా ఆయన చేసిన ధర్మకార్యాలను మౌ శాసనం ప్రశంసించింది. మదనవర్మ ప్రధాన సలహాదారు లాహదా అనే బ్రాహ్మణుడికి కళలలో ప్రావీణ్యం ఉండేది.[12]
మదనవర్మ సేనాపతి అజయపాలుడు సేనాపతి కిల్హానా కుమారుడని పరమార్ది సెమ్రా శాసనంలో పేర్కొన్నారు. ఆయన మహా-ప్రతిహారా, సమగ్రామ-సింహా గురించి కలంజర శాసనంలో ప్రస్తావించబడింది.[12]
మదనవర్మ కూర్చుని ఉన్న దేవత చిత్రంతో ముద్రించబడిన బంగారం, వెండి, రాగి నాణేలను జారీ చేశాడు. ఆయన హనుమంతుడు చిత్రంతో రాగి నాణేలను కూడా జారీ చేశాడు. ఈ నాణేలు ఆయన పేరును శ్రీమాను మదన-వర్మ-దేవా అని పేర్కొన్నాయి.[13]
పరమల-రాసో అభిప్రాయం ఆధారంగా మదనవర్మ పెద్ద సంఖ్యలో సరోవరాలు, దేవాలయాలను నిర్మించారు. ఆయన బ్రాహ్మణులకు పెద్ద మొత్తంలో బంగారం, ఆభరణాలు, గుర్రాలు, ఏనుగులను బహుమతిగా ఇచ్చాడు.[14]
అజయగడ్, కలంజర భవనాల మీద మదనవర్మ పేరు కనిపిస్తుంది. మహోబా వద్ద సరస్సు చుట్టూ ఉన్న శిథిలమైన శివ, విష్ణు దేవాలయాలు ఆయనకు నిర్మించినట్లు ఆపాదించబడ్డాయి. అహరు (టికాంగడ్ జిల్లా) లోని మదనేషా-సాగర-పురా ఆలయం కూడా ఆయన పేరును కలిగి ఉంది. టికాంగడ్ జిల్లాలోని మహోబా, జతారా, అహరు-నారాయణపుర ప్రాంతంలో ఆయన పేరు మీద "మదనా-సాగర" (లేదా మదన సాగరు) అనే సరస్సులు త్రవ్వించబడ్డాయి. ఈ ట్యాంకుల ఒడ్డున ఆయన ఒకప్పుడు నిర్మించిన దేవాలయాలు ఉండేవి. అనేక ఇతర ప్రదేశాలకు మదనవర్మ పేరు పెట్టారు; వీటిలో ఝాన్సీ జిల్లాలోని మదనపురా, మహోబా సమీపంలోని మడంఖేరా ఉన్నాయి.[15]
ఆయన పాలనలో అహరు, ఖాజురాహో, మహోబా, పాపౌరా, ఇతర ప్రదేశాలలో జైన తీర్థంకరుల అనేక చిత్రాలు కనుగొనబడ్డాయి.[16]
సా.శ 1192 లో ప్రస్తుత భారత్ కాలా భవన్ వద్ద ఉన్న శాసనంలో ఆయన ముగ్గురు రాణుల గురించి ప్రస్తావించబడింది: మహారాణి (ప్రధాన రాణి) వల్హనా-దేవి, రజనీ లఖమదేవి, రజనీ చందాలా దేవి.[10]కలంజర శాసనం ఆధారంగా ప్రతాప-వర్మను ఆయన తమ్ముడు.[17] మదనవర్మ కుమారుడు రెండవ యశో-వర్మ, ఆయన మనవడు పరమార్ది-దేవా. యశో-వర్మ పాలించలేదు లేదా చాలా తక్కువ కాలం పాలించారని భావిస్తున్నారు. చారిత్రాత్మక ఆధారాలు మదనవర్మ తరువాత పరమార్ది అధికారపీఠం అధిష్ఠించాడని సూచిస్తున్నాయి.[2]