మళ్ళీరావా | |
---|---|
దస్త్రం:Malli Raava Poster.jpg | |
దర్శకత్వం | గౌతమ్ తిన్ననూరి |
నిర్మాత | రాహుల్ యాదవ్ నక్కా |
తారాగణం | యార్లగడ్డ సుమంత్ కుమార్ ఆకాంక్ష సింగ్ |
ఛాయాగ్రహణం | సతీష్ ముత్యాల |
కూర్పు | సత్య గిడుతూరి |
సంగీతం | శ్రావణ భరద్వాజ్ |
విడుదల తేదీ | 8 డిసెంబరు 2017 |
సినిమా నిడివి | 124 minutes |
దేశం | India |
భాష | తెలుగు |
మళ్ళీరావా డిసెంబర్ 8, 2017 లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విడుదలైన చలనచిత్రం. రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రానికి నిర్మాత. సుమంత్, ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు. ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి తెరంగేట్రం చేసింది. శ్రావణ్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మధుర ఆడియో ఈ చిత్ర సంగీతం విడుదల చేసింది. బ్లు స్కై సినిమాస్ వారు ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించారు.[1][2]
కార్తీక్ (సుమంత్) ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అతనికి అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చింది. అదే సమయంలో తన మాజీ ప్రియరాలు అంజలి (ఆకాంక్ష సింగ్) పెళ్ళి శుభలేఖ కార్తీకకి కనిపిస్తుంది. అప్పుడు కార్తీక్ తనకి అంజలికి మధ్య ఉన్న జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుంటాడు. కార్తీక్, అంజలి తొమ్మిదవ తరగతిలో ప్రేమించుకొని విడిపోయారు. వారు 2012లో మళ్ళీ కలుసుకుంటారు. పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ అంజలి పెళ్ళి రోజున కార్తీక్ ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని కార్తీక్ కి చెప్పి అమెరికాకు వెళ్ళింది. కార్తీక్ అంజలిని ఎటువంటి కారణం అడగలేదు. అంజలి మళ్ళీ 2017లో కార్తీక్ ని కలవడానికి హైదరాబాదుకు తిరిగి వస్తుంది. అక్కడినుండి వారిద్దరి మధ్య జరిగిన ప్రయాణం, 2012లో పెళ్ళి రోజున విడిచి వెళ్ళడానికి కారణం ఏమిటి అన్నది ఈ కథ. [3]
యార్లగడ్డ సుమంత్ కుమార్ - కార్తిక్
ఆకాంక్ష సింగ్ - అంజలి
అభినవ్ గోమఠం - డుంబో
అన్నపూర్ణ (నటి) - డుంబో నాయనమ్మ
ప్రీతి అస్రాని - చిన్నప్పటి అంజలి
సాత్విక్ వర్మ - చిన్నప్పటి కార్తిక్
కార్తీక్ అడుసుమల్లి - మురళి
అనితానంత్ - సుష్మ, అంజలి అమ్మ
అప్పాజీ అంబరీష దర్భా - మోహన్, అంజలి నాన్న
కాదంబరి కిరణ్ - సోషల్ మాష్టారు
అనిత నాథ్ - సుష్మ
ఈ చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మొదటి చిత్రం. కథానాయకి ఆకాంక్ష సింగ్ తెలుగులో నటించిన మొదటి చిత్రం. గౌతమ్ ఈ చిత్రాన్ని ముందుగానే వేరే నటులతో చిత్రీకరించి సుమంత్ ను కలిసి తమ చిత్రం ఎలా ఉండబోతుంది అని చూపించాడు. తరువాత చిత్రం కోసం 9 నుండి 10 నెలల ప్రీ ప్రొడక్షన్ పని జరిగింది. తరువాత 30 నుండి 35 రోజుల పాటు షూటింగ్ జరిగింది.[4] పూజిత తాడికొండ ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైర్. వినయ్ సాగర్ జొన్నల ఈ చిత్రానికి అస్సోసియేట్ దర్శకుడు. సతీష్ ముత్యాల ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. సత్య గిడుతూరి ఈ చిత్రానికి ఎడిటర్. [5]
మళ్ళీరావా చిత్రాన్ని మూడు కోట్ల రూపాయలతో నిర్మించటం జరిగింది. ఈ చిత్రం విడుదలైన రోజున 20 లక్షల రూపాయలను వాసులు చేసింది. మొదటి వరంలో 2.3 కోట్ల రూపాయలను, 11 రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల రూపాయలను వసూలు చేయాగా వాటిలో ఒక కోటి రూపాయలు అమెరికా బాక్సాఫీసు నుండి వాసులు చేసింది. [6]
సం. | పాట | గాయకుడు/గాయని | పాట నిడివి |
---|---|---|---|
1. | "మళ్ళీ రావా" | శ్రావణ్ భరద్వాజ్ | 2:55 |
2. | "చినుకు" | కార్తీక్ | |
3. | "వెల్కమ్ బ్యాక్ తో లవ్" | హేమచంద్ర | |
4. | "ఎన్నడూ" | సాయి కృష్ణ, లలిత కావ్య | |
5. | "అడుగేసాలే" | కాలభైరవ | |
మొత్తం నిడివి: | 21:36 |