महाराष्ट्र क्रिकेट संघ | |
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | అంకిత్ బావ్నే (ఫక్లా) రుతురాజ్ గైక్వాడ్ (లిఎ, టి20) |
కోచ్ | సంతోష్ జెధే |
యజమాని | మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
రంగులు | Yellow Dark Blue |
స్థాపితం | 1934 |
స్వంత మైదానం | మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే |
సామర్థ్యం | 37,000 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 2 (1939/40, 1940/41) |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 0 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 1 (2009-2010)[1] |
అధికార వెబ్ సైట్ | MCA |
మహారాష్ట్ర క్రికెట్ జట్టు భారత దేశీయ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర క్రికెట్ జట్టు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ దీని యజమాని. ఇది పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తన హోమ్ మ్యాచ్‌లను ఆడుతుంది.
2022 అక్టోబరు 3 నాటికి మహారాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీని 2 సార్లు గెలుచుకుంది, 3 సార్లు రన్నరప్‌గా నిలిచింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని 1 సారి గెలుచుకుంది, 1 సారి రన్నరప్‌గా నిలిచింది. విజయ్ హజారే ట్రోఫీలో 1994-95లో వెస్ట్ జోన్ విజేతగా నిలిచింది. [2]
1934-35లో మొట్టమొదటి రంజీ ట్రోఫీ టోర్నమెంట్లో పాల్గొన్న 15 జట్లలో మహారాష్ట్ర ఒకటి. డిబి దేవధర్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసాడు. బొంబాయితో జరిగిన తొలి మ్యాచ్‌లో తృటిలో ఓడిపోయింది. [3] ఇది అప్పటి నుండి పోటీ చేస్తూనే ఉంది. రెండుసార్లు గెలిచి, మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 1939-40, 1940-41లో యునైటెడ్ ప్రావిన్స్, మద్రాస్ క్రికెట్ జట్టును ఫైనల్లో ఓడించి మహారాష్ట్ర వరుసగా రెండు రంజీ ట్రోఫీలను గెలుచుకుంది. 1970-71 సీజన్లో బాంబే క్రికెట్ జట్టుపై, 1992-93లో పంజాబ్‌పై, 2013-14 సీజన్లో కర్ణాటకపై ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.[4]
మహారాష్ట్ర ఆటగాడు భౌసాహెబ్ నింబాల్కర్ 1948 రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో 443 పరుగులు చేశాడు, ఆ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పటికీ భారతీయుడి అత్యధిక రంజీ ట్రోఫీ, ఫస్ట్ క్లాస్ స్కోరు అదే. [5]
2021 ఫిబ్రవరి నాటికి మహారాష్ట్ర రంజీ ట్రోఫీలో 395 మ్యాచ్‌లు ఆడి, 98 గెలిచి, 75 ఓడిపోయింది. 222 సార్లు డ్రా చేసుకుంది. [6]
1994-95 విజయ్ హజారే ట్రోఫీలో ఈ జట్టు వెస్ట్ జోన్ విజేతగా నిలిచింది. [2]
చారిత్రికంగా పూణేలోని నెహ్రూ స్టేడియంలోని పూనా జింఖానా గ్రౌండ్లో మహారాష్ట్ర క్రికెట్ జట్టు తన హోమ్ మ్యాచ్‌లను ఆడుతూ వస్తోంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పూణే వెలుపల గహుంజేలో తన సొంత అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించాక, అది తన హోమ్ మ్యాచ్‌లను 'మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం' లోనే (MCA స్టేడియం అని కూడా పిలుస్తారు)లో ఆడుతోంది.
మహారాష్ట్ర జట్టు 2009–10లో తన మొదటి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకుంది. ఇది T20 ల్లో దేశీయ ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంటు. ఫైనల్లో హైదరాబాద్ క్రికెట్ జట్టును 19 పరుగుల తేడాతో ఓడించింది. 2018-19 సీజన్లో ఫైనల్లో కర్ణాటక క్రికెట్ జట్టుపై ఓడిపోయింది. [7]
మహారాష్ట్ర క్రికెట్ జట్టు నుండి వచ్చిన కొంతమంది ప్రసిద్ధ క్రికెటర్లు:
పేరు | పుట్టినరోజు | బ్యాఅటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు |
---|---|---|---|---|
బ్యాటర్లు | ||||
అంకిత్ బావ్నే | 17 డిసెంబరు 1992 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | First Class Captain |
రాహుల్ త్రిపాఠి | 2 మార్చి 1991 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Plays for Sunrisers Hyderabad in IPL |
పవన్ షా | 4 సెప్టెంబరు 1999 | కుడిచేతి వాటం | ||
కేదార్ జాదవ్ | 26 మార్చి 1985 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Plays for Royal Challengers Bangalore in IPL |
యష్ నహర్ | 10 అక్టోబరు 1994 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
ఆల్ రౌండర్లు | ||||
అజీమ్ కాజీ | 14 అక్టోబరు 1993 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
ఆశయ్ పాల్కర్ | 1 సెప్టెంబరు 1989 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
సిద్ధేష్ వీర్ | 21 ఫిబ్రవరి 2001 | కుడిచేతి వాటం | ||
కౌశల్ తాంబే | 14 అక్టోబరు 2002 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
వికెట్ కీపర్లు | ||||
సౌరభ్ నవలే | 27 డిసెంబరు 1999 | కుడిచేతి వాటం | ||
రుతురాజ్ గైక్వాడ్ | 31 జనవరి 1997 | కుడిచేతి వాటం | List A and Twenty20 Captain Plays for Chennai Super Kings in IPL | |
నౌషాద్ షేక్ | 15 అక్టోబరు 1991 | కుడిచేతి వాటం | ||
స్పిన్ బౌలర్లు | ||||
సత్యజిత్ బచావ్ | 28 నవంబరు 1992 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
షంషుజామా కాజీ | 10 నవంబరు 1994 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
విక్కీ ఓస్ట్వాల్ | 1 సెప్టెంబరు 2002 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
పేస్ బౌలర్లు | ||||
రాజవర్ధన్ హంగర్గేకర్ | 10 నవంబరు 2002 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Plays for Chennai Super Kings in IPL |
మనోజ్ ఇంగాలే | 26 జూన్ 1994 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
ప్రదీప్ దాధే | 13 సెప్టెంబరు 1994 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
ముఖేష్ చౌదరి | 6 జూలై 1996 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం | Plays for Chennai Super Kings in IPL |
దివ్యాంగ్ హింగనేకర్ | 14 అక్టోబరు 1993 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం |
24 జనవరి 2023 నాటికి నవీకరించబడింది
మహారాష్ట్ర క్రికెట్ జట్టు కోచింగ్ సిబ్బంది:
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: Missing or empty |title=
(help)[permanent dead link]