వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మాట్ హెన్రీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | 1991 డిసెంబరు 14|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 2 అం. (1.88 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 266) | 2015 మే 21 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 మార్చి 17 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 183) | 2014 జనవరి 31 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 మే 05 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 21 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 65) | 2014 డిసెంబరు 4 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 21 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11–present | కాంటర్బరీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | వోర్సెస్టర్షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | కింగ్స్ XI పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | డెర్బీషైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018, 2022 | కెంట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | సోమర్సెట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | వెల్ష్ ఫైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2023 జూలై 27 |
మాథ్యూ జేమ్స్ హెన్రీ (జననం 1991 డిసెంబరు 14) న్యూజిలాండ్ ప్రొఫెషనల్ క్రికెటరు. అతను కాంటర్బరీ దేశీయ జట్టుకు, న్యూజిలాండ్ జాతీయ జట్టుకూ ఆడుతున్నాడు. అతను కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలరు. హెన్రీ 2019–2021 ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ గెలిచిన న్యూజిలాండ్ జట్టులో సభ్యుడు.
హెన్రీ ఒక సంవత్సరం స్కాలర్‌షిప్‌పై ఇంగ్లండ్, ఇప్స్‌విచ్‌లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఆరవ ఫారమ్ చదివాడు. దానికి ముందు పాపనుయ్లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో [1] క్రైస్ట్‌చర్చ్‌లోని సెయింట్ బెడెస్ కాలేజీలో [2] చదువుకున్నాడు. [3]
హెన్రీ 2011 నుండి న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో కాంటర్బరీ తరపున ఆడాడు, 2011 మార్చిలో వెల్లింగ్టన్తో జరిగిన 2010–11 ప్లంకెట్ షీల్డ్‌లో అతని ఫస్ట్-క్లాస్ క్రికెట్ రంగప్రవేశం చేశాడు. అతను, 2016లో వోర్సెస్టర్‌షైర్‌కు కొంతకాలం పాటు ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాడు. [4] 2017 నాట్‌వెస్టు t20 బ్లాస్టు [5] లో డెర్బీషైర్ కోసం ఆడాడు. 2018 సీజన్ మొదటి భాగంలో కెంట్ కోసం వారి విదేశీ ఆటగాడిగా ఆడాడు.[4] [6] గ్లౌసెస్టర్‌షైర్‌పై తన కెంట్ రంగప్రవేశంలో ఏడు వికెట్లు తీసిన తర్వాత, ఏప్రిల్ 2018 చివరిలో డర్హామ్‌పై హెన్రీ తన అత్యుత్తమ ఇన్నింగ్స్, మ్యాచ్ బౌలింగు గణాంకాలను సాధించాడు. అతను డర్హామ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండవ ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టి, తన మొదటి పది వికెట్ల హాల్‌ను 12/73 మ్యాచ్ గణాంకాలతో నమోదు చేశాడు. [7] [8] హెన్రీ క్లబ్‌తో ఉండగానే కెంట్ క్యాప్‌ను అందుకున్నాడు.
2017 ఫిబ్రవరిలో, 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో కింగ్స్ XI పంజాబ్ జట్టు అతన్ని 50 లక్షలకు కొనుగోలు చేసింది. [9] అతను గతంలో 2014, 2015 లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సంతకం చేశాడు, కానీ జట్టు కోసం మ్యాచ్ ఆడలేదు.
2019 జూలైలో, అతను యూరో T20 స్లామ్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభ ఎడిషన్‌లో ఎడిన్‌బరో రాక్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు. [10] [11] అయితే, మరుసటి నెలలో టోర్నీ రద్దు చేయబడింది. [12] 2021 నవంబరులో, హెన్రీ మళ్లీ కెంట్ తరపున ఆడటానికి సంతకం చేసాడు, ఈసారి ఇంగ్లాండ్‌లో 2022 క్రికెట్ సీజన్ కోసం. [13] 2023 ఫిబ్రవరిలో, హెన్రీ తదుపరి జూలై వరకు కౌంటీ ఛాంపియన్షిప్ కోసం సోమర్సెట్ ద్వారా సంతకం చేయబడ్డాడు. హెన్రీ సోమర్‌సెట్‌తో చాలా విజయవంతమైన సీజన్‌ను కలిగి ఉన్నాడు, టోర్నమెంటులో ప్రముఖ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
హెన్రీ 2014 జనవరి 31న భారత్‌తో జరిగిన ఐదవ వన్డే లో అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు. [14] అతను 2014 డిసెంబరు 4న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ తరపున తొలి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు [15]
2015 క్రికెట్ ప్రపంచ కప్ కోసం 15 మందితో కూడిన తుది జట్టులో ఎంపిక కానప్పటికీ, ఈడెన్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఆడమ్ మిల్నే స్థానంలో అతను ఎంపికయ్యాడు. [16] అతను మ్యాచ్‌లో వికెట్లేమీ తీయలేదు. అయితే మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హెన్రీ తీవ్రమైన పేస్‌ని ప్రదర్శించాడు. డేవిడ్ వార్నర్, మైఖేల్ క్లార్క్ ల వికెట్లు తీశాడు. [17] 2016లో అతను జిమ్మీ నీషమ్‌తో కలిసి, వన్డేలలో న్యూజిలాండ్ తరపున 9వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పాడు. భారతదేశానికి వ్యతిరేకంగా ఈ జోడీ 84 పరుగులు చేసింది.[18]
2015 మేలో ఇంగ్లండ్‌తో జరిగిన పర్యటనలో హెన్రీ తన తొలి టెస్టు ఆడాడు.[19]
2018 మేలో, 2018–19 సీజన్‌కు న్యూజిలాండ్ క్రికెట్, కొత్త కాంట్రాక్టు ఇచ్చిన ఇరవై మంది ఆటగాళ్లలో అతను ఒకడు. [20] 2019 ఏప్రిల్‌లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టుకు ఎంపికయ్యాడు. [21] [22] 2019 జూలై 3న, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, హెన్రీ తన 50వ వన్డేలో ఆడాడు. [23] మొదటి సెమీ-ఫైనల్లో, న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. హెన్రీ 37 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [24] [25]
2022 ఫిబ్రవరిలో, దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో, హెన్రీ టెస్టు క్రికెట్లో 7/23తో తన మొదటి ఐదు వికెట్ల పంటను సాధించాడు. [26]
2023 మార్చిలో, పాకిస్తాన్ పర్యటన కోసం న్యూజిలాండ్ వన్డే, T20I జట్టులో హెన్రీ ఎంపికయ్యాడు. [27] 2023 ఏప్రిల్ 14న, మొదటి T20Iలో, T20Iలలో హ్యాట్రిక్ సాధించిన నాల్గవ న్యూజిలాండ్ క్రికెటరయ్యాడు. [28]