మొత్తం జనాభా | |
---|---|
6,40,843 (2020) (60% of total population) ![]() | |
మతాలు | |
హిందూమతం |
మారిషస్ ఫ్రెంచి వలస పాలకులూ, ఆ తరువాత తోటల్లో పని కోసం బ్రిటిషు వారూ భారతీయులను తీసుకువచ్చినప్పుడు హిందూమతం మారిషస్‌కు వచ్చింది.[1][2][3] వలసదారులు ప్రధానంగా ఇప్పుడు భారతదేశంలోని బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చారు.[1]
మారిషస్‌లో హిందూమతం అతిపెద్ద మతం. 2011 నాటికి జనాభాలో హిందువులు దాదాపు 48.5% ఉన్నారు [4] ఆఫ్రికాలో హిందూమతం అత్యధికంగా ఆచరించే దేశం మారిషస్. హిందువుల శాతం పరంగా నేపాల్, భారతదేశం తర్వాత ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.
సంవత్సరం | శాతం | మార్పు |
---|---|---|
1871 | 41.97% | |
1881 | 55.99% | +14.02% |
1891 | 56.10% | +0.11% |
1901 | 55.62% | -0.48% |
1911 | 54.26% | -1.36% |
1921 | 52.70% | -1.56% |
1931 | 50.37% | -2.33% |
1944 | 47.26% | -3.11% |
1952 | 46.97% | -0.29% |
1962 | 47.55% | +0.58% |
1972 | 49.56% | +2.01% |
1983 | 50.65% | +1.09% |
1990 | 50.63% | -0.02% |
2000 | 49.64% | -0.99% |
2011 | 48.54% | -1.10% |
2015 | 48.14% | -0.40% |
2020 | 50.39% | +2.15% |
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1871 | 1,32,652 | — |
1881 | 2,02,281 | +52.5% |
1891 | 2,09,079 | +3.4% |
1901 | 2,06,131 | −1.4% |
1911 | 2,02,716 | −1.7% |
1921 | 2,01,895 | −0.4% |
1931 | 2,02,192 | +0.1% |
1944 | 2,03,709 | +0.8% |
1952 | 2,41,660 | +18.6% |
1962 | 3,32,851 | +37.7% |
1972 | 4,21,707 | +26.7% |
1983 | 5,06,486 | +20.1% |
1990 | 5,35,028 | +5.6% |
2000 | 5,85,210 | +9.4% |
2011 | 6,00,327 | +2.6% |
యూరోపియన్ వలస శక్తులు 19వ శతాబ్దపు మొదటి అర్ధ భాగంలో బానిసల వ్యాపారాన్ని నిషేధించాయి. బ్రిటిషు సామ్రాజ్యం కూడా 19వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో దీనిని నిషేధించింది. అయితే, చెరకు, పత్తి, పొగాకు తదితర వాణిజ్య పంటలలో తక్కువ ధర కార్మికుల కోసం డిమాండు పెరుగుతూ వచ్చింది. బ్రిటిషు సామ్రాజ్యం ఆఫ్రికా బానిస కార్మికుల స్థానంలో భారతదేశం నుండి ఒప్పంద కార్మికులను తెచ్చుకుంది.[5][6]
భారతదేశం నుండి తీసుకువచ్చిన ఒప్పంద కార్మికులు ప్రధానంగా హిందువులే. కానీ ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. వారు ఒప్పందానికి లోబడి ఉంటారు. ఇది చాలాకాలంగా చేసుకుంటూ ఉన్న ఒప్పంద రూపమే. ఒక నిర్ణీత కాలం పాటు వెట్టి కార్మికులుగా ఉండాలనేది ఈ ఒప్పందం. నిర్ణీత కాల వ్యవధి అనేది లేకపోతే ఇది బానిసత్వాన్ని పోలి ఉంటుంది.[7] భారతదేశం నుండి ఒప్పంద కార్మికులతో కూడిన మొదటి నౌకలు 1836లో బయలుదేరాయి.[8] చెరకు, భారతదేశానికి చెందిన ఒక పంట. ఐరోపా లోని శీతల అక్షాంశాలలో ఇది పెరగదు. కానీ ఉష్ణమండల అక్షాంశాలలో పెరుగుతుంది. చెరుకు ఉత్పత్తుల కోసం ఐరోపా, అమెరికాల్లో పెరుగుతున్న డిమాండును తీర్చడానికి వలస ఉష్ణమండలాల్లో దాన్ని పండిస్తారు. ఈ చెరకు తోటల్లోను, ఇతర ఉష్ణమండల వాణిజ్య పంటల్లోనూ పనిచేసేందుకు భారతదేశం నుండి మారిషస్, ఫిజీ, జమైకా, ట్రినిడాడ్, మార్టినిక్, సురినామ్, తదితర ద్వీప దేశాలకు ఒప్పంద కార్మికులుగా హిందువులు వెళ్ళారు.[8]
కార్మిక ఒప్పందాలను అంగీకరించి మారిషస్‌కు వచ్చిన హిందువులు, హిందూయేతరులు భారతదేశంలో ఉండగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. వలస పాలనలో భారతదేశంలో పేదరికం, ఆకలి చావులు, అంటువ్యాధులు, తీవ్రమైన కాలానుగుణ కరువులూ ప్రబలంగా ఉండేవి.[9][10][11] 19వ శతాబ్దపు బ్రిటిషు భారతదేశంలో లక్షలాది మంది భారతీయులు ఆకలితో సామూహికంగా చనిపోతూ ఉండేవారు.[11] అప్పటి తీవ్రమైన పరిస్థితులు కుటుంబాలు, గ్రామాలను విచ్ఛిన్నం చేసి, వలస పోక తప్పని పరిస్థితిని సృష్టించాయి.[9] 1839 నాటికి, మారిషస్‌లో ఇప్పటికే 25,000 మంది భారతీయులు అక్కడి వలస తోటలలో బానిసత్వం లాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. అయితే వలసవాద కార్మిక చట్టాలు స్త్రీలు, పిల్లలను మగవారితో పాటు రాకుండా నిరోధించినందున, ఈ ఒప్పంద కార్మికుల్లో ప్రధానంగా పురుషులే ఉండేవారు. కానీ, 1840లలో బ్రిటిషు ప్లాంటేషన్ కాలనీలలో చౌక కార్మికుల కోసం తీవ్రమైన కొరత కారణంగా పురుషులు, మహిళలు ఇద్దరినీ పెద్ద సంఖ్యలో ఒప్పంద కార్మికులను మారిషస్‌కు రవాణా చేసారు. ముఖ్యంగా కలకత్తా, బొంబాయి, మద్రాసు ఓడరేవుల నుండి ఈ రవాణా చేశారు.[9][8] సోషియాలజీ ప్రొఫెసరు మైఖేల్ మాన్ ప్రకారం, 18వ - 20వ శతాబ్దాల మధ్య కాలంలో ప్రపంచమంతటా రవాణా అయిన 3 కోట్ల మంది భారతీయ ఒప్పంద కార్మికులలో, మారిషస్‌కు చేరుకున్న వారు చాలా చిన్న భాగం మాత్రమే. (వీరిలో చాలా మంది కొన్నేళ్ళు అక్కడ పనిచేసిన తర్వాత తిరిగి భారతదేసం వచ్చేసారు).[12]
మారిషస్ బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యం పొందే సమయానికి, దాని జనాభాలో ఎక్కువ భాగం భారతీయ వారసత్వానికి చెందినవారే. పాట్రిక్ ఐసెన్లోర్ ప్రకారం, మారిషస్ మొత్తం జనాభాలో దాదాపు 70% భారతీయ మూలాలు ఉన్నవారే. తమను తాము హిందువులుగా గుర్తించుకునే వారు మొత్తం జనాభాలో 48%, లేదా భారతీయ సంతతికి చెందిన వారిలో 69% ఉన్నారు.[13]
మారిషస్‌లో ఇళ్ళ లోను, వాణిజ్యంలోనూ హిందువులు మాట్లాడే ప్రధాన భాషలు క్రియోల్, భోజ్‌పురి, తమిళం, హింది.[14] రాజకీయంగా చురుకైన హిందువులు హిందీని తమ "మాతృభాష", "పూర్వీకుల భాష" అని పిలవడం ద్వారా దానిని సంరక్షించుకోడానికి ప్రయత్నించారని ఐసెన్హోల్ర్ అంటాడు. అలాగే తాము ఎదుర్కొన్న వలసవాద వివక్షకు వ్యతిరేకంగా దాన్ని ఒక ర్తక్షణగా భావించారు. అయితే చాలా మంది హిందువులు తమ దైనందిన జీవితంలో క్రియోల్ను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. క్రియోల్ అనేది ద్వీపంలో అభివృద్ధి చెందిన భారతీయులు, ఆఫ్రికన్ల సమకాలీకరణ భాష.[14]
మారిషస్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఛానెల్ అయిన మారిషస్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్లో అనేక భోజ్‌పురి-భాషా టెలివిజన్ కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది.[15] భోజ్‌పురిని విస్తృతంగా ఉపయోగించే మారిషస్‌లోని హిందువులలో లా నికోలియర్ సమీపంలోని గ్రామీణ దక్షిణ, ఉత్తర-మధ్య ప్రాంతాలు ఉన్నాయి.[16] ఈ స్థావరాలు ప్రధానంగా బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని గంగా మైదాన ప్రాంతాల నుండి వచ్చిన హిందువులకు చెందినవి. వారి భాష అసలు భోజ్‌పురి యొక్క మార్పు చెందిన రూపం.[16]
ఒడ్వర్ హోలప్, తదితర పండితుల ప్రకారం, మారిషస్‌లో స్థిరపడిన హిందువులు కుల వ్యవస్థను పాటించలేదు. మారిషస్‌లో కుల పరిమితులను పట్తించుకోరు.[17][18][19] "భారతీయ ఒప్పంద కార్మికులు వెళ్ళిన అతిధేయ సమాజాలలో ఉన్న ఆర్థిక రాజకీయ పరిస్థితులు కులాంతరాలకు అనుకూలంగా ఉండేవి కావు" అని చాలా మంది విద్వాంసులు గమనించారని హోలప్ అన్నాడు. కులం అనేది సామాజిక సూత్రం కాదని వారు గమనించారు. భారతీయ కార్మికులందరూ (కూలీలు) "ఒకే రకమైన పని చేసేవారు, అందరికీ ఒకే జీవన పరిస్థితులుండేవి".[17]
ద్వీపంలో అతిపెద్ద హిందూ పండుగలలో ఒకటి మహా శివరాత్రి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఈ వార్షిక హిందూ వేడుకను నాలుగు నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఉపవాసం శివారాధనతో రాత్రంతా జాగరణ చేస్తారు.
మారిషస్‌లోని ఇతర ముఖ్యమైన హిందూ పండుగలు:[20]
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ మారిషస్‌లో అనేక దేవాలయాలను నిర్వహిస్తోంది.
<ref>
ట్యాగు; "britain1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు