రచయిత(లు) | సంపాదకుని పేరు రొబర్ట్ బకింగ్హం |
---|---|
మూల శీర్షిక | Martindale: The Complete Drug Reference |
దేశం | యునైటెడ్ కింగ్డమ్ |
భాష | ఆంగ్లం |
విషయం | ఫార్మసీ, వైద్యశాస్త్రం |
శైలి | ఔషధాల సమాచారం |
ప్రచురణ కర్త | ఫార్మస్యూటికల్ ప్రెస్ |
ప్రచురించిన తేది | మే 2020 (40వ సంచిక) |
మీడియా రకం | Hardback print, digital online |
ISBN | 978-0-85711-367-2 |
OCLC | 1112886663 |
Website | https://www.pharmpress.com/product/9780857113672/martindale40 |
మార్టిన్డేల్: ద కంప్లీట్ డ్రగ్ రెఫరన్స్ (Martindale: The Complete Drug Reference, అర్థం: మార్టిన్డేల్: పూర్తిస్థాయి ఔషధ కోశం (గ్రంథం)) అనేది ఫార్మస్యూటికల్ ప్రెస్ (Pharmaceutical press) అనే ముద్రణా సంస్థచే ప్రచురించబడుతున్న ఒక సంప్రదింపు పుస్తకం. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న సుమారు 6000 డ్రగ్సూ [గమనిక 1], మందులనూ, 1,25,000 పైచిలుకు ప్రప్రైయటరీ ప్రిపరెయ్షన్స్తో (Proprietary preparation, అర్థం: సొంత తయారీ) సహా చేర్చబడ్డాయి. అలాగే సుమారు 700 వ్యాధి చికిత్సా సమీక్షలు కూడా ఉన్నాయి.
ఈ పుస్తకం మొదటిసారిగా 1883లో మార్టిన్డేల్: ద ఎక్స్ట్రా ఫార్మకపీయ (Martindale: The Extra Pharmacopoeia, అర్థం: మార్టిన్డేల్: అదనపు ఔషధ సంహితం) అనే పేరుతో ప్రచూరితమైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ చికిత్సలకు వాడే మందీలతో పాటు పరిమిత స్థాయిలో పరీక్షలకూ, పశువైద్య శాస్త్రంలోకీ వాడుకలోనున్న డ్రగ్స్ గురించిన సమాచారం దీనిలో ఉంటుంది. ఇవే కాక మూలికలూ, ప్రత్యామ్నాయ వైద్య విధాన ఔషధాలూ, ఫార్మస్యూటికల్ ఎక్స్సిపియన్ట్స్ [గమనిక 2], వైటమిన్లూ, పౌష్ఠిక కారకాలూ, టీకాలూ, రెయ్డియొఫార్మస్యూటికల్స్ (radiopharmaceuticals), కొన్ట్రాస్ట్ మీడియా (contrast media), డైయగ్నొస్టిక్ ఎయ్జన్ట్సూ (Diagnostic agents), వైద్య వాయువులూ, వ్యసన పదార్థాలూ, విషపూరిత పదార్థాలూ, క్రిమినాశనిలూ, పురుగుల మందులు గూర్చిన సమాచారం కూడా ఇందులో ఇవ్వబడింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న డ్రగ్స్, అలాగే చికిత్సల్లో ప్రధాన పాత్ర పోషించే ఇతర పదార్థాలన్నిటిని పొందుపరచడం ఈ పుస్తకపు లక్ష్యం. ఈ పుస్తకం వైద్య సిబ్బంది రోగి వాడే మందు ఏమిటనేది రూఢీ చేసుకోవడానికి పనికొస్తుంది; మచ్చుకు విదేశాల నుండి వచ్చిన రోగి, తను వాడే మందుది బ్రెన్డ్ నెయ్మ్ (Brand name) [గమనిక 3] చెబితే, అది ఏ మందో ఈ పుస్తకం చూసి తెలుసుకోవచ్చు. అలాగే ఏదైనా డ్రగ్ దొరకతకపోతే, దాని బదులు వాడదగ్గ డ్రగ్స్ ఏమేమి ఉన్నాయో కూడా తెలుస్తుంది. ప్రతీ డ్రగ్ పైనా ఒక ఏకవిషయక రచన ఉంటుంది. ఈ రచనలో ఆ డ్రగ్ యొక్క కెమికల్ అబ్స్ట్రెక్ట్ సర్విస్[గమనిక 4] సంఖ్యా, ఎనటొమికల్ థెరప్యూటిక్ కెమికల్ క్లెసిఫికెయ్షన్ సిస్టమ్ కోడ్, యు.ఎస్ ఆహార ఔషధ నియంత్రణ సంస్థ యూనీక్ ఇంగ్రీడ్యన్ట్ ఐడెన్టిఫైయర్ (UNII) కోడ్లు ఉంటాయి. ఇవి పాఠకులు ఇతర సమాచార వ్యవస్థలను సంప్రదించడానికి పనికొస్తాయి.
ఈ పుస్తకం రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది. వీటితో పాటు మూడు సమగ్ర సూచికలు ఉంటాయి:
డిజిటల్ ప్రతులలో ఇంకో 1,000 ఏకవిషయ రచనలూ, 1,00,000 మిశ్రమాల పేర్లూ, 5,000 తయారీదారుల పేర్లూ అదనంగా ఉన్నాయి.
ఇప్పటివరకూ 40 సంచికలు విడుదలయ్యాయి. 40వ సంచిక మే 2020లో ప్రచూరితమైంది.