మిలింద్ దేవరా | |||
| |||
పదవీ కాలం 13 మే 2004 - 16 మే 2014 | |||
ముందు | జయవంతిబెన్ మెహతా | ||
---|---|---|---|
తరువాత | అరవింద్ సావంత్ | ||
నియోజకవర్గం | దక్షిణ ముంబై | ||
కమ్యూనికేషన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం జులై 2011 – మే 2014 | |||
షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం అక్టోబర్ 2012 – మే 2014 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1976 డిసెంబరు 4 బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | శివసేన (2024 జనవరి 14 – ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ (2004–2024) | ||
తల్లిదండ్రులు | మురళీ దేవరా (తండ్రి) | ||
జీవిత భాగస్వామి | పూజ మిలింద్ దేవరా[1] | ||
నివాసం | ముంబై | ||
పూర్వ విద్యార్థి | బోస్టన్ యూనివర్సిటీ ( బీబీఏ) | ||
వెబ్సైటు | milinddeora.in |
మిలింద్ దేవరా (జననం 4 డిసెంబర్ 1976) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కమ్యూనికేషన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2] మిలింద్ దేవరా 2004, 2009లో ముంబై సౌత్ లోక్సభ నుండి గెలిచి 2014, 2019లో ఓడిపోయాడు.
మిలింద్ దేవరా తన తండ్రి మురళీ దేవరా అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ ముంబై నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జయవంతిబెన్ మెహతాపై 10,000 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో 2004లో రక్షణ మంత్రిత్వ శాఖలో కన్సల్టేటివ్ కమిటీతో పాటు రక్షణపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
మిలింద్ దేవరా 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ ముంబై నియోజకవర్గం నుండి రెండోసారి ఎంపీగా ఎన్నికై[3] ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కమిటీ సభ్యుడిగా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, 1 మే 2010 నుండి అంచనాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు. ఆయన జులై 2011 నుండి మే 2014 నుండి వరకు కమ్యూనికేషన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రిగా, అక్టోబర్ 2012 నుండి మే 2014 వరకు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
మిలింద్ దేవరా 2024 జనవరి 14న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేరాడు.[4]