వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | తిస్సే అప్పుహమిలాగే మిలింద సిరివర్దన | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | నాగోడ, శ్రీలంక | 1985 డిసెంబరు 4|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Batting ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 131) | 2015 అక్టోబరు 14 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2016 మే 27 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 164) | 2015 జూలై 11 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2019 జూన్ 15 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 57 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 55) | 2015 ఆగస్టు 1 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2017 ఏప్రిల్ 6 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Basnahira South | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Chilaw Marians CC | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Sebastianites C&AC | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | కందురాటా Maroons | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Dhaka Division | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Sri Lanka A | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
విక్టోరియా SC | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | Ruhuna Royals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | Bhairahawa Gladiators | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | Galle Gladiators | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNricinfo, 28 July 2021 |
తిస్సే అప్పుహమిలాగే మిలింద సిరివర్దన, (జననం 1985, డిసెంబరు 4) శ్రీలంక క్రికెటర్. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, ఎడమచేతి వాటం స్పిన్నర్ గా రాణించాడు. శ్రీలంక కోసం టెస్టు, వన్డే, టీ20, దేశవాళీ అరేనాలో ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఎ ఆడాడు. కలుతర విద్యాలయంలో చదివాడు. షార్ట్ కవర్లో ఫీల్డింగ్ చేశాడు.
2005లో సెబాస్టియనైట్స్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్‌కు ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. శ్రీలంక ఎ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 కోసం 30-సభ్యుల తాత్కాలిక జట్టులో చేర్చబడ్డాడు. అయితే అతను చివరి 15 జట్టు నుండి తప్పించబడ్డాడు. ఎస్ఎల్సీ ఇంటర్-ప్రావిన్షియల్ టోర్నమెంట్లో రుహునా రాయల్స్‌తో జరిగిన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో బస్నాహిర సౌత్ తరపున 135 పరుగులు చేశాడు, ఐదు వికెట్లు కూడా సాధించాడు.
2015 జూలై 11న పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మిలిందా తన వన్డే ఇంటర్నేషనల్ రంగగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో అరంగేట్రం చేశాడు.[1]
పాకిస్తాన్ సిరీస్‌లో ఐదవ వన్డేలో తన మొదటి వన్డే అర్ధశతకం సాధించాడు. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్‌తో కలిసి 114 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని చేశాడు. శ్రీలంక 50 ఓవర్లలో 368/4 స్కోరు చేయడం ద్వారా పాకిస్తాన్‌పై తమ అత్యధిక వన్డే స్కోరును నమోదు చేసింది.
2015 జూలై 30న పాకిస్తాన్‌పై శ్రీలంక తరపున ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు, ఔట్ అయ్యేవరకు వేగంగా 35 పరుగులు చేశాడు. చివరికి ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోయింది. సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో ఇతనికి మొదటి టీ20 అంతర్జాతీయ వికెట్ లభించింది, షోయబ్ మాలిక్ వికెట్ తీసుకున్నాడు.[2]
2015 అక్టోబరు 14న వెస్టిండీస్‌పై తన టెస్టు అరంగేట్రం చేశాడు.[3] టెస్ట్ క్యాప్ పొందే ముందు, అదే జట్టుతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో అజేయ శతకం సాధించాడు.[4]
2019 ఏప్రిల్ లో 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[5][6] అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్ కోసం ఐదు ఆశ్చర్యకరమైన ఎంపికలలో అతనిని ఒకరిగా పేర్కొంది.[7]