ముదుండి రామకృష్ణ రాజు | |
---|---|
జననం | భీమవరం, ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | భౌతికశాస్త్రవేత్త |
పురస్కారాలు | పద్మశ్రీ |
ముదుండి రామకృష్ణ రాజు భారతీయ భౌతిక శాస్త్రవేత్త, క్యాన్సర్ చికిత్సకు అణు భౌతిక శాస్త్ర అనువర్తనంపై తన పరిశోధనకు ప్రసిద్ధి చెందారు.[1][2] అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు, భీమవరం లో ఉన్న ఇంటర్నేషనల్ క్యాన్సర్ సెంటర్, మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ లకు మేనేజింగ్ ట్రస్టీ.[3][2][4] మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లారెన్స్ రేడియేషన్ లాబొరేటరీ, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, లాస్ అలమోస్ నేషనల్ లాబొరేటరీ వంటి అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని వివిధ సంస్థలలో రేడియేషన్ థెరపీ 35 సంవత్సరాల పరిశోధనా అనుభవం అతనికి ఉందని నివేదించబడింది.[1][4][5][2][6] 2013లో భారత ప్రభుత్వం రాజు ని నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది.[7]