రాఖీ సేథీ, హర్యానా కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి (తల్లి)
బంధువులు
ఆదిరాజ్ సేథి (తమ్ముడు)
ముస్కాన్ సేథీ (ఆంగ్లం: Musskan Sethi; జననం 1995 సెప్టెంబరు 18) ఒక భారతీయ నటి.[1][2][3] 2017లో వచ్చిన పైసా వసూల్, 2019లో వచ్చిన రాగల 24 గంటల్లో[4][5][6]వంటి చిత్రాలతో ఆమె బాగా ప్రసిద్ధి చెందింది.
ముస్కాన్ సేథి తన మోడలింగ్ కెరీర్‌ను శామ్సంగ్, పానాసోనిక్,సెల్లో, గోల్డ్ ఫాగ్, సిస్కా, డాబర్ గులాబారి వంటి బ్రాండ్ల కోసం టీవీ వాణిజ్య ప్రకటనలు చేయడం ద్వారా ప్రారంభించింది. 2017లో పైసా వసూల్ సినిమాతో తెరంగేట్రం చేసింది.[7] 2019లో రాగల 24 గంటల్లో, హై ఎండ్ యారియన్(High End Yaariyaan) చిత్రాల్లో నటించింది.[8]
ఢిల్లీలో 1995లో జన్మించిన ముస్కాన్ సేథి[9] జీడి గోయెంకా పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తిచేసింది. న్యూయార్క్‌కు వెళ్లి ప్రాట్ ఇన్స్టిట్యూట్ లో ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లొమా పూర్తి చేసింది. స్వదేశం తిరిగివచ్చాక ఆమె ముంబైకి మకాం మార్చింది. అక్కడ స్కూల్ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియాలో డిగ్రీని అభ్యసించింది.