మోరన్ | ||
---|---|---|
మాట్లాడే దేశాలు: | భారతదేశం | |
ప్రాంతం: | అస్సాం | |
మాట్లాడేవారి సంఖ్య: | — | |
భాషా కుటుంబము: | Sino-Tibetan సాల్ బోడో-గారో బోడో మోరన్ | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | none | |
ISO 639-2: | — | |
ISO 639-3: | none | |
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
మోరన్ ( మోరాన్ ) అనేది అంతరించిపోయిన బోడో-గారో భాష, ఈశాన్య భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఈ భాష ఉపయోగంలో ఉండేది. ఈ భాష టిన్సుకీయ జిల్లాలోని దిమాసా తెగ వారికి సంభదించినది. మోరాన్ అంటే 'అటవీ నివాసి' అని అర్థం.
మోరాన్ తెగకి చెందిన ప్రజలు 13 వ శతాబ్దంలో బ్రహ్మపుత్ర నదికి ఆగ్నేయ దిశలో నివసించేవారని చరిత్ర తెలుపుతుంది. జనాభా లెక్కల ప్రకారం మోరాన్ భాష మాట్లాడే వారు 1901 లో 78 మంది, 1911 లో 24 మంది ఉండగా 1931 సంవత్సరానికి ఈ భాష తెలిసిన వారు జన గణనలో లేరని తెలుస్తుంది. ఈ భాష యొక్క ఏకైక మూలం 1904లో PR గుర్డాన్ రాసిన కథనంలో ఉంది. [1] [2] ఈ భాష మాట్లాడే వారు రాను రాను అస్సామీ భాషకు మారినట్లు గ్రహించవచ్చు.
తల్లి - ఆయి
తండ్రి - ఆబాయి
మనిషి - సదాయి
స్త్రీ - సాయిసి
అబ్బాయి - సదైరా
అమ్మాయి - సాయిసిర
తాత - డ్యూటా
నాన్నమ్మ - ఆబోయి
గౌరవనీయుడు/స్నేహితుడు - ఓయ్ యు
వ్యక్తి - సదాయి
పెద్ద వ్యక్తి - సదైరా
1 - సే
2 - నె
3 - సామ్
4 - బీరి
5 - బాహా
6 - డు
7 - సినీ
8 - సాక్
9 - సాకు (జి-ఖో)
10 - టి