యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ | |
---|---|
వడియార్ రాజవంశానికి 27వ అధిపతి | |
Tenure | 28 మే 2015 – ప్రస్తుతం |
పూర్వాధికారి | శ్రీకంఠదత్త వడియార్ |
యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | ప్రతాప్ సింహా | ||
---|---|---|---|
నియోజకవర్గం | మైసూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బెంగళూరు, కర్ణాటక , భారతదేశం | 1992 మార్చి 24||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | త్రిశిఖా కుమారి వడియార్ (మ. 2016) | ||
సంతానం | 1 |
యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ (జననం 24 మార్చి 1992) భారతదేశానికి చెందిన వడియార్ రాజవంశానికి చెందిన రాజ వంశస్థుడు, రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మైసూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
యదువీర్ మైసూర్‌ను పాలించిన 25వ & చివరి మహారాజు జయరామచంద్ర వడియార్ మనవడు.[2][3] శ్రీకంఠదత్త . రాణి ప్రమోదా దేవికి పిల్లలు లేరు, కాబట్టి ఆమె యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్‌ను అధికారికంగా దత్తత తీసుకొని అతన్ని మైసూరు వంశానికి 27వ యువరాజుగా చేసి మేలో పట్టాభిషేకం చేసింది.[4]
యదువీర్ వడియార్ 27 జూన్ 2016న రాజస్థాన్‌కు చెందిన పూర్వపు దుంగార్‌పూర్ రాజ కుటుంబానికి చెందిన హర్షవర్ధన్ సింగ్, మహశ్రీ కుమారి కుమార్తె త్రిశిఖా కుమారి దేవిని వివాహం చేసుకున్నాడు.[5] త్రిశిఖ 6 డిసెంబర్ 2017న బెంగుళూరులో కుమారుడు ఆద్యవీర్ నరసింహరాజ వడియార్ కు జన్మనిచ్చింది.[6]