యానిమల్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | సందీప్ రెడ్డి వంగా |
స్క్రీన్ ప్లే | సందీప్ రెడ్డి వంగా సౌరభ్ గుప్తా |
కథ | సందీప్ రెడ్డి వంగా |
నిర్మాత | భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ మురాద్ ఖేతాని అశ్విన్ వర్దే ప్రణయ్ రెడ్డి వంగా సందీప్ రెడ్డి వంగా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | అమిత్ రాయ్ |
కూర్పు | సందీప్ రెడ్డి వంగా |
సంగీతం | పాటలు:
సచేత్-పరంపర హర్షవర్ధన్ రామేశ్వర్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | ఎఎ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 1 డిసెంబరు 2023 |
సినిమా నిడివి | 182 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | est. ₹100 crore[2][3] |
యానిమల్ (Animal) 2023లో విడుదలైన భారతీయ హిందీ-భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, సందీప్ రెడ్డి వంగా రచన,దర్శకత్వం తో పాటు ఎడిటర్‌గా కూడా వ్యవహారించారు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.
ఈ సినిమా టైటిల్‌తో పాటు 2021 జనవరిలో అధికారికంగా ప్రకటించారు. ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ 2022 ఏప్రిల్‌లో ప్రారంభమై, 2023 ఏప్రిల్‌లో పూర్తయింది. ఈ చిత్రానికి సంగీతం JAM8, విశాల్ మిశ్రా, జానీ, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, అషిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్ సమకూర్చారు, సినిమాటోగ్రఫీ అమిత్ రాయ్ నిర్వహించారు. యానిమల్ స్టాండర్డ్, IMAX ఫార్మాట్లలో 2023 డిసెంబరు 1న థియేటర్లలో విడుదలైంది, విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. 201 నిమిషాల రన్టైమ్తో (3 గంటల 21 నిమిషాలు), ఈ చిత్రం అత్యంత పొడవైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం 2023 డిసెంబరు 2 నాటికి ₹235.93 కోట్లు (US$30 మిలియన్లు) వసూలు చేసింది.[4][5] ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రి మొదలైనవారు నటించారు.[6]
యానిమల్ 2023 డిసెంబరు 1న విడుదలైంది.[7]
గ్యాంగ్‌స్టర్ డ్రామా, ఇది అండర్‌వరల్డ్ తీవ్ర రక్తపాతం నేపథ్యంలో ఏర్పడిన సమస్యాత్మకమైన తండ్రీ కొడుకుల సంబంధం చుట్టూ తిరుగుతుంది, ఇది చివరికి కథానాయకుడు మానసిక రోగిగా మారడానికి దారితీస్తుంది.[8]
ఈ చిత్రం అధికారిక ప్రకటన వీడియో 2021 జనవరి 1న విడుదలైంది. చిత్రం మొదటి పోస్టర్ 2023 జనవరి 1న విడుదల చేయబడింది, అయితే ప్రీ-టీజర్ 2023 జూన్ 11న విడుదలైంది. ఈ చిత్రం 2023 ఆగస్టు 11న విడుదల కావాల్సి ఉన్నా భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), డబ్బింగ్ పనుల కారణంగా వాయిదా పడింది.[11][12][13] ఈ చిత్రం ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 డిసెంబరు 1న విడుదలైంది.[7][14]
The film, which will see Ranbir in an absolutely new avatar, is said to be made on a budget of ₹100 crore, and is set to release on December 1.
In an interview, Ranbir Kapoor had opened up about his character in the film saying, It's a new territory for me. It's a crime drama and a father-son story. It's something audiences don't expect me to do.