యోగేంద్ర శుక్లా (1896 - 1960 నవంబరు 19) భారతీయ జాతీయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA) వ్యవస్థాపకులలో ఒకడు, బసావోన్ సింగ్ (సిన్హా) తో కలిసి బీహార్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు చేసినవారిలో ఒకడు & సెల్యులార్ జైల్ (కాలాపానీ) లో జైలు జీవితం గడిపాడు.[1]
యోగేంద్ర శుక్లా ( 1907 మే 15 - 1934 మే 14) బీహార్ రాష్ట్రం, ముజఫర్‌పూర్ జిల్లా, జలాల్‌పూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన 1932 నుండి 1937 వరకు బిహార్ & ఉత్తర ప్రదేశ్‌లో భారత స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి సెల్యులార్ జైల్ (కాలాపానీ) లో జైలు శిక్ష అనుభవించాడు. ఆయన మొత్తం పదహారున్నర సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. బ్రిటిష్ సైన్యం వివిధ జైళ్లలో ఆయన ఖైదీగా ఉన్న సమయంలో, అతనిని తీవ్రంగా హింసించారు. ఆయన అనారోగ్యంతో మరణించాడు.
బ్రిటిష్ న్యాయశాఖ కార్యదర్శి, కౌన్సిల్‌లో 1932 అక్టోబరులో గవర్నర్ నిర్దేశించిన ప్రకారం, భారత స్వాతంత్ర్య విప్లవాత్మక దోషుల పేర్లను సూచించమనగా వారు యోగేంద్ర శుక్లా, బసావన్ సింగ్ (సిన్హా), శ్యామ్‌దేవ్ నారాయణ్ అలియాస్ రామ్ సింగ్, ఈశ్వర్ దయాల్ సింగ్, కేదార్ మణి శుక్లా, మోహిత్ చంద్ర అధికారి, రామ్ ప్రతాప్ సింగ్ పేర్లను డిఐజి (సిఐడి) సూచించాడు. దీనితో వారిని సెల్యులార్ జైల్ అండమాన్‌కు బదిలీ చేశారు.
యోగేంద్ర శుక్లా, కేదార్ మణి శుక్లా, శ్యామ్‌దేవ్ నారాయణ్ 1932 డిసెంబరులో 1937లో 46 రోజుల నిరాహార దీక్ష చేయగా వారిని సెల్యులార్ జైల్ అండమాన్ నుండి హజారీబాగ్ సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. 1937లో శ్రీ కృష్ణ సిన్హా మొదటి కాంగ్రెస్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినప్పుడు, ఆయన రాజకీయ ఖైదీల సమస్యను చేపట్టాడు ఈ సమస్యల పై 1938 ఫిబ్రవరి 15న రాజీనామా చేయడంతో వైస్రాయ్ ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించి యోగేంద్ర శుక్లాతో పాటు ఇతర రాజకీయ ఖైదీలు 1938 మార్చిలో విడుదల చేశారు.[2]
యోగేంద్ర శుక్లా జైలు నుండి విడుదలైన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ముజఫర్‌పూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1938లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఎన్నికై, కొంతకాలం తర్వాత జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరాడు. ఆయన స్వామి సహజనంద్ సరస్వతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల భారత కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యుడైన తరువాత 1940లో అతడిని అరెస్టు చేశారు.
యోగేంద్ర శుక్లా 1942 ఆగస్టులో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు హజారీబాగ్ సెంట్రల్ జైలు గోడను జయప్రకాశ్ నారాయణ్, సూరజ్ నారాయణ్ సింగ్, గులాబ్ చంద్ గుప్తా, రాంనందన్ మిశ్రా, షాలిగ్రామ్ సింగ్‌తో కలిసి స్వేచ్ఛ కోసం భూగర్భ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అప్పుడు అనారోగ్యంతో ఉన్న జయప్రకాశ్ నారాయణ్‌ని తన భుజాలపై మోసుకుంటూ గయకు దాదాపు 124 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు.[3] శుక్లా జైలు నుండి పారిపోవడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ కోసం 5000 రూపాయల రివార్డ్ గా ప్రకటించింది. ఆయన ముజఫర్‌పూర్‌లో 1942 డిసెంబరు 7న అరెస్టు చేసి బక్సర్ జైలులో బంధించారు. ఆయన 1946 ఏప్రిల్లో విడుదలయ్యాడు.
యోగేంద్ర శుక్లా 1958లో ప్రజా సోషలిస్ట్ పార్టీ తరపున బీహార్ శాసనమండలి సభ్యునిగా నామినేట్ అయ్యి 1960 వరకు సభ్యుడిగా పనిచేశాడు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ 1960 నవంబరు 19న మరణించాడు.