రంజాన్ ఖాన్ | |
---|---|
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | మున్నా మాస్టర్ |
పౌరసత్వం | భారతదేశం |
వృత్తి | భారతీయ గాయకుడు, సమాజ సేవకుడు |
Notable work(s) | శ్రీ శ్యాం సురభి వందన |
పిల్లలు | ఫిరోజ్ ఖాన్ (కుమారుడు) |
పురస్కారాలు | పద్మశ్రీ(2020) |
మున్నా మాస్టర్ గా ప్రసిద్ధి చెందిన రంజాన్ ఖాన్, భారతీయ గాయకుడు, సామాజిక కార్యకర్త. అతను భజనలు పాడతాడు. ఆవులను సంరక్షిస్తారు.[1][2] అతను రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా చెందినవాడు. కళలకు అతను చేసిన కృషికి గాను 2020లో భారతదేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించబడ్డారు.[3]
తన కుమారుడు ఫిరోజ్ ఖాన్ ను 2019 నవంబర్లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క సంస్కృత విద్యా ధర్మ విజ్ఞాన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించడంపై వివాదం చెలరేగిన తరువాత ఖాన్ ఆవులు, కృష్ణ-భక్తి పట్ల తన అంకితభావంతో వెలుగులోకి వచ్చాడు. అతను సంస్కృత భాష శాస్త్రి డిగ్రీని కలిగి ఉన్నాడు.[4] అతను శ్రీ శ్యామ్ సురభీ వందన అనే పుస్తకాన్ని రచించాడు.[5]