రమేష్ కరాద్ | |||
![]() రమేష్ కరాద్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | ధీరజ్ దేశ్‌ముఖ్ | ||
నియోజకవర్గం | లాతూర్ రూరల్ | ||
పదవీ కాలం 2020 మే 14 – 2024 నవంబర్ 23 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | కాశీరామ్ కరాద్ (తండ్రి) | ||
నివాసం | లాతూర్ , మహారాష్ట్ర , భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | పూణే కళాశాల డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రమేష్ కాశీరామ్ కరాద్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో లాతూర్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రమేష్ కరాద్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో లాతూర్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి వైజ్‌నాథ్ షిండే చేతిలో 23,583 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3] ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి త్రయంబక్ భిసే చేతిలో 10,510 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
రమేష్ కరాద్ 2020లో లాతూర్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడై, 2020లో మహారాష్ట్ర శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ధీరజ్ దేశ్‌ముఖ్‌ను 10,510 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 112,051 ఓట్లతో విజేతగా నిలవగా, ధీరజ్ దేశ్‌ముఖ్‌కి 1,05,456 ఓట్లు వచ్చాయి.[5][6]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)