రాక్షసుడు | |
---|---|
దర్శకత్వం | రమేశ్ వర్మ |
రచన | రామ్ కుమార్ |
నిర్మాత | హవీష్ కోనేరు సత్యనారాయణ |
తారాగణం | బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ |
ఛాయాగ్రహణం | వెంకట్ సి.దిలీప్ |
కూర్పు | అమర్ రెడ్డి |
సంగీతం | గిబ్రాన్ |
నిర్మాణ సంస్థ | ఏ స్టూడియో |
పంపిణీదార్లు | అభిషేక్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2 ఆగస్టు 2019 |
సినిమా నిడివి | 149నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹16 కోట్లు[1] |
బాక్సాఫీసు | అంచనా ₹25 కోట్లు[2] |
రాక్షసుడు 2019లో వచ్చిన సస్పెన్స్ క్రైమ్ థిల్లర్ సినిమా. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో హిట్టయిన "రాక్షసన్"ను తెలుగు రీమేక్ చేశారు. 2019 ఆగస్టు 2న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.[3]
అరుణ్ (బెల్లంకొండ శ్రీనివాస్) కు సినీ రంగంలో అవకాశాలు రాక.. చివరకు కుటుంబం ఒత్తిడి మేరకు పోలీస్ ఉద్యోగంలో చేరతాడు. స్కూల్ ఏజ్ అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అతడు ఉద్యోగంలో చేరాకా ఓ పదహారేళ్ళ అమ్మాయి హత్య చేయబడుతుంది. అప్పటికే నేర పరిశోధనలపై అవగాహన ఉన్నా అరుణ్ ఇది ఒక సైకో చేసిన హత్యగా గుర్తిస్తాడు. కానీ పోలిస్ డిపార్ట్మెంట్ అతన్ని నమ్మదు. వరుసగా ఇలాంటి హత్యేలే జరుగుతూ ఉండడంతో పోలిస్ డిపార్ట్మెంట్ అతన్ని నమ్మి అతనికి ఈ కేసును అప్పగిస్తుంది. ఈ క్రమంలో హీరో అరుణ్ అ కేసును ఎలా చేధించాడు అన్నది ఈ సినిమా కథ .