ఆర్. వాసుదేవన్ | |
---|---|
జననం | తమిళనాడు |
నివాసం | భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రంగములు | రసాయన శాస్త్రం |
వృత్తిసంస్థలు | త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు. |
చదువుకున్న సంస్థలు | మద్రాసు విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | వ్యర్థపదార్థాల నిర్వహణ ప్లాస్టిక్ రోడ్లు |
రాజగోపాలన్ వాసుదేవన్ భారతదేశ శాస్త్రవేత్త. ఆయన వ్యర్థ పదార్థాల నిర్వహణా కార్యక్రమాలలో విశేష కృషిచేసాడు. ఆయన త్యాగరాజర్ కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ గా పనిచేయుచున్నారు.[1] ఆయన ప్రపంచ కాలుష్యానికి ముఖ్య కారణ మైన ప్లాస్టిక్ వ్యర్థాలను పురర్వినియోగం చేస్తూ అధిక నాణ్యత, మన్నిక గల ప్లాస్టిక్ రోడ్లను రూపొందించారు. ఈ విధానం వల్ల పర్యావరణానిని నష్టం కలిగిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి ఉపయోగించవచ్చు. వేగంగా రోడ్లను నిర్మాణం చేయవచ్చు. ఆయన 2008 ఏప్రిల్ 15 నమహాత్మా పాఠశాలలను సందర్శించారు. అధిక వర్షాలు కురిసినా సరే ఆయన రూపకల్పన చేసిన ప్లాస్టిక్ రోడ్లకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు.[2][3][4][5] ఆయన రూపొందించిన ఈ విధానాలను భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. [6]
ఆయన 1965, 1967 లలో బి.యస్సీ, ఎం.ఎస్సీ లను మద్రాసు విశ్వవిద్యాలయం నుండి చేసారు. ఆయన 1974లో అదే విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పొందారు. 1975 లో ఆయన తియగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అధ్యాపకునిగా చేరారు, 1998లో ప్రొఫెసరుగా ఉద్యోగ భాద్యతలను నిర్వహిస్తున్నారు. [7]
ఆయన పరిశోధనలు ముఖ్యంగా వ్యర్థ పదార్థాల నిర్వహణ మూలంగా ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణం.