వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | పటియాల, పంజాబ్ | 1980 అక్టోబరు 18
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
పాత్ర | ఆల్ రౌండర్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు | |
తొలి వన్‌డే (క్యాప్ 82) | 2000 డిసెంబరు 2 - జింబాబ్వే తో |
చివరి వన్‌డే | 2002 నవంబరు 21 - వెస్టిండీస్ తో |
మూలం: Cricinfo, 2022 ఫిబ్రవరి 6 |
రీతీందర్ సింగ్ సోధి, పంజాబ్ కు చెందిన మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు. పంజాబ్‌కు చెందిన ఆల్ రౌండర్ కోసం వెతుకుతున్నప్పుడు భారత సెలెక్టర్‌లు ఎంపిక చేసిన వారిలో ఒకడు. భారతదేశపు మొదటి అండర్ 19 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక సభ్యుడు.[1] 2000 డిసెంబరులో కటక్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసాడు.[2]
రీతీందర్ సింగ్ సోధి 1980, అక్టోబరు 18న పంజాబ్ లోని పటియాలలో జన్మించాడు.
2000లో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీ మొదటి ఇన్‌టేక్ కోసం ఎంపికయ్యాడు.[3] భారతదేశం అండర్-15 ప్రపంచ కప్ విజయంలో రీతీందర్ సింగ్ సోధీ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. భారతదేశం అండర్-19 ప్రపంచ కప్ విజయంలో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.[4] 2000 డిసెంబరులో ఇండియన్ వన్ డే ఇంటర్నేషనల్ స్క్వాడ్‌లో చేర్చబడ్డాడు. చిన్న వయస్సులోనే జాతీయ జట్టులోకి వేగంగా ఎదిగాడు. ఇండియన్ క్రికెట్ లీగ్‌లో అహ్మదాబాద్ రాకెట్స్ తరపున కూడా ఆడాడు.[5]
ఆ తరువాత వెంటనే తొలగించబడ్డాడు. భారత ఎంపిక కోసం ముందున్నవారిలో నిలిచిపోయాడు. ఇప్పుడు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మ్యాచ్ రిఫరీగా పనిచేస్తున్నాడు.[2]