రెండవ సోమేశ్వరుడు (సా.శ 1068 - 1076) పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన రాజు. ఈయన తన తండ్రి అయిన మొదటి సోమేశ్వరుని తర్వాత రాజ్యాధికారం చేపట్టాడు. ఇతను మొదటి సోమేశ్వరుని పెద్ద కొడుకు. ఇతను పరిపాలనలో రాజ్యాధికారం మీద కాంక్ష ఉన్న తమ్ముడు ఆరవ విక్రమాదిత్య నుంచి ముప్పు ఉండేది. అనతి కాలంలోనే ఆరవ విక్రమాదిత్య తన అన్న రెండవ సోమేశ్వరుని పడదోసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు.
1070 నాటికి రెండవ సోమేశ్వరుడు మాళవ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు.[1]
సోమేశ్వరుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వీరరాజేంద్ర చోళుడి ఆధ్వర్యంలోని చోళసైన్యం ఇతని రాజ్యంపైకి యుద్ధానికి వచ్చింది. వారు గుత్తిని ఆక్రమించుకున్నారు. ఈ యుద్ధంలో విక్రమాదిత్యుడు తన అన్నకు సహాయపడవలసింది పోయి దానిని తాను అధికార పీఠం ఎక్కడానికి అవకాశంగా మలుచుకున్నాడు.