రేణూ దేశాయ్ | |
---|---|
![]() | |
జననం | రేణూ దేశాయ్ డిసెంబరు 4, 1981 |
వృత్తి | మోడల్, నటి, కాస్ట్యూమ్ డిజైనర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2000-2006 |
జీవిత భాగస్వామి | పవన్ కళ్యాణ్[1] |
పిల్లలు | అకీరా నందన్ (జ. 2004) ఆద్య(జ. 2010) |
రేణూ దేశాయ్ (జ. డిసెంబరు 4, 1981) ఒక తెలుగు నటి, మోడల్, కాస్ట్యూం డిజైనర్.[2]
రేణుదేశాయ్ మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4 న జన్మించింది. ఆమె మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా ఆమె సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో చర్చ కు దారితీసింది. పవన్ తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్ తోనే జానీ సినిమాలో నటించింది. 2004లో వీరిద్దరికి పెళ్ళి కాకముందే అబ్బాయి అకీరా నందన్ పుట్టాడు. 2009 జనవరి 28న లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు[3]. ఆ తరువాత వారికి కూతురు ఆద్య పుట్టింది. వారు 2011లో విడాకుల కొరకు కోర్టులో కేసు ఫైల్ చేయగా 2012లో వారికి విడాకులు మంజూరైనవి. [4][5][6] 2018లో, దేశాయ్ తనకు నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించింది, కానీ తన కాబోయే భర్త గుర్తింపును వెల్లడించలేదు.[7][8]
సంవత్సరం | చిత్రం | పాత్ర |
2000 | జేమ్స్ పండు | రేణు |
2000 | బద్రి | వెన్నెల |
2003 | జానీ | గీత |
సంవత్సరం | చిత్రం |
2001 | ఖుషి |
2003 | జానీ |
2004 | గుడుంబా శంకర్ |
2005 | బాలు |
2006 | అన్నవరం |
2022 | టైగర్ నాగేశ్వరరావు[9] |