లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం |
---|
Awarded for | పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్, విద్యావేత్తలు, వ్యాపార నాయకులు మొదలైనవారు. |
---|
దేశం | భారతదేశం |
---|
అందజేసినవారు | లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ |
---|
మొదటి బహుమతి | 1999 |
---|
వెబ్సైట్ | LBSIM official website |
---|
లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ప్రారంభించబడిన ఒక వార్షిక ప్రతిష్టాత్మక పురస్కారం. ఇందులో భాగంగా ఎంపిక చేసిన వ్యక్తికి 5,00,000 రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేస్తారు.
ఈ పురస్కారం 1999 లో ప్రారంభించబడింది. ఉన్నతమైన వృత్తిపర శ్రేష్ఠత సాధించినందుకు నిరంతర వ్యక్తిగత సహకారాల కోసం వ్యాపార నాయకులు, మేనేజ్మెంట్ ప్రాక్టీషనర్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్, విద్యావేత్తలు, సంస్థ స్థాపక కర్తలు వంటి మొదలైన వారికి ఈ పురస్కారం అందించబడుతుంది. ఈ అవార్డును భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.[1]
- 2019: డాక్టర్ మంజు శర్మ
- 2018: ఫాలి ఎస్. నారిమన్ (రాజ్యాంగ నిపుణుడు)
- 2017: బిందేశ్వర్ పాఠక్
- 2016: గోపాలకృష్ణ గాంధీ (ప్రముఖ పాలనాధికారి, విద్యావేత్త, దౌత్యవేత్త, ప్రముఖ రచయిత)
- 2015: ప్రణయ్ రాయ్ (ఎన్ డి టి వి సహ వ్యవస్థాపకుడు)
- 2014: ఎ. శివతాను పిళ్లై (బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషికి)[2]
- 2013: డా. రాజేంద్ర అచ్యుత్ బద్వే (డైరెక్టర్, టాటా మెమోరియల్ సెంటర్, ప్రొఫెసర్ & హెడ్, సర్జికల్ ఆంకాలజీ విభాగం, టాటా మెమోరియల్ హాస్పిటల్, ముంబై)[3]
- 2012: శ్రీమతి. టెస్సీ థామస్
- 2011: ప్రొఫెసర్ యష్ పాల్
- 2010: శ్రీమతి. అరుణ రాయ్
- 2009: శ్రీ సునీల్ భారతి మిట్టల్
- 2008: డా. ఇ. శ్రీధరన్
- 2006: డాక్టర్ ఎం. ఎస్. స్వామినాథన్
- 2005: డా. నరేష్ ట్రెహాన్
- 2004: డాక్టర్ సి.పి. శ్రీవాత్సవ[4]
- 2003: శ్రీమతి. ఎల రమేష్ భట్
- 2002: డాక్టర్ ఆర్.ఎ. మశేల్కర్
- 2001: ఎన్.ఆర్. నారాయణ మూర్తి
- 2000: మిస్టర్ సామ్ పిట్రోడా
- 1999: ప్రొఫెసర్ సి.కె. ప్రహ్లాద్
- ↑ "Excellence award, LBSNA 2013". Daily Pioneer. 10 July 2013.
- ↑ "AS Pillai, father of BrahMos, gets Lal Bahadur Shastri Award" Archived 2014-10-09 at the Wayback Machine, The Economic Times, 7 October 2014
- ↑ "Retired officer gets Shastri award"[dead link], The Hindu, 2 October 2005
- ↑ "Retired officer gets Shastri award"[dead link], The Hindu, 2 October 2005