వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | కరాచీ, బ్రిటిష్ ఇండియా | 1935 ఫిబ్రవరి 4|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1994 జూలై 1 కరాచీ, పాకిస్తాన్ | (వయసు 59)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 23) | 1955 నవంబరు 7 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1962 ఆగస్టు 16 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2016 జూన్ 13 |
వాలిస్ మథియాస్ (1935, ఫిబ్రవరి 4 - 1994, సెప్టెంబరు 1) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1955 నుండి 1962 వరకు 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్తాన్ తరపున ఆడిన మొదటి ముస్లిమేతర క్రికెటర్ గా నిలిచాడు.[1]
వాలిస్ మథియాస్ 1935, ఫిబ్రవరి 4న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు. కరాచీలోని గోవా కమ్యూనిటీకి చెందినవాడు.[2][3] జింఖానా క్లబ్‌లోని ఒక పోర్టర్ కుమారుడు.[4] కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో చదువుకున్నాడు.[5]
మథియాస్ ఒక స్టైలిష్ కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు. టెస్ట్ కెరీర్లో మూడు హాఫ్ సెంచరీలు (వెస్టిండీస్‌పై) చేశాడు. 1958-59లో ఢాకాలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ప్రతి ఇన్నింగ్స్‌లో 64, 45 పరుగులు చేశాడు.[6]
పాకిస్థానీ దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన స్కోరర్ గా నిలిచాడు. పాకిస్తాన్ కంబైన్డ్ స్కూల్స్ క్రికెట్ టీమ్ తరపున కూడా ఆడాడు. 1962లో ఇంగ్లాండ్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత, తర్వాతి నాలుగు సంవత్సరాల్లో అతను 13 మ్యాచ్‌లలో 113.08 సగటుతో 1357 పరుగులు చేసాడు.[7] 1965-66లో రైల్వేస్ గ్రీన్స్‌పై కరాచీ బ్లూస్ తరపున 278 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు, ఇది అతని కెరీర్-బెస్ట్ స్కోరు.[8] నాలుగు సంవత్సరాల తరువాత అతను కొత్తగా ఏర్పడిన నేషనల్ బ్యాంక్ క్రికెట్ జట్టులో చేరి, మొట్టమొదటి కెప్టెన్ అయ్యాడు, 1976-77 వరకు ఆడాడు. తరువాత జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. 146 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 16 సెంచరీలు, 44.49 సగటుతో 7,520 పరుగులు చేశాడు. టెస్టుల్లో 22 క్యాచ్‌లు 130 పట్టుకున్నాడు.
మథియాస్ తన 59 సంవత్సరాల వయస్సులో 1994, సెప్టెంబరు 1న మెదడు రక్తస్రావంతో మరణించాడు.[9]