![]() 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో వాషింగ్టన్ సుందర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | చెన్నై | 5 అక్టోబరు 1999||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | వాషి[1] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 185 cమీ. (6 అ. 1 అం.)[2] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగు ఆల్ రౌండరు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 301) | 2021 జనవరి 15 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2021 మార్చి 4 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 220) | 2017 డిసెంబరు 13 - శ్రీలంక తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 జనవరి 24 - న్యూజీలాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 5 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 72) | 2017 డిసెంబరు 24 - శ్రీలంక తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఫిబ్రవరి 1 - న్యూజీలాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 5 (formerly 55) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–present | తమిళనాడు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | రైజింగ్ పూణే సూపర్‌జయింట్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–2021 | రాయల్ చాలెంజర్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022–present | సన్‌రైజర్స్ హైదరాబాదు (స్క్వాడ్ నం. 5) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | లాంకషైర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 24 March 2023 |
వాషింగ్టన్ సుందర్ (జననం 1999 అక్టోబరు 5) భారత క్రికెట్ జట్టు తరఫున ఆడుతున్న భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, దేశీయ క్రికెట్‌లో తమిళనాడు తరపున కూడా ఆడుతున్నాడు. సుందర్ ఎడమచేతి వాటం బ్యాటరు, కుడిచేతి ఆఫ్ స్పిన్నరు. [3] [4] అతను 2017 డిసెంబరు 13 న శ్రీలంకపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
వాషింగ్టన్ సుందర్ 1999 అక్టోబరు 5 న తమిళనాడులోని చెన్నైలో ఒక తమిళ హిందూ కుటుంబంలో జన్మించాడు. [5] సుందర్ తండ్రికి కూడా చిన్నతనంలో క్రికెట్‌పై అభిరుచి ఉండేది. అది గమనించి అతనికి సాయపడిన PD వాషింగ్టన్ అనే వ్యక్తి గౌరవార్థం తన తన కుమారుడికి అతని పేరు పెట్టుకున్నాడు.[6][7] అతని సోదరి శైలజా సుందర్ కూడా ప్రొఫెషనల్ క్రికెటర్.[8] [9] సుందర్ నాలుగైదు సంవత్సరాల వయస్సు నుంచి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. [10] అతను ప్రారంభ విద్య సెయింట్ బెడేస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివాడు.[11]
అతను 2016 అక్టోబరు 16న 2016–17 రంజీ ట్రోఫీలో తమిళనాడు తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[12] రవిచంద్రన్ అశ్విన్ లాగానే వాషింగ్టన్ సుందర్ కూడా ముందు బ్యాట్స్‌మెన్‌గా మొదలుపెట్టి, ఆఫ్‌స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2017 అక్టోబరులో అతను 2017-18 రంజీ ట్రోఫీలో త్రిపురపై తమిళనాడు తరపున బ్యాటింగ్ చేస్తూ తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు.[13] అతను 2016లో ఇండియా U-19 ప్రపంచ కప్‌కు కూడా ఎంపికయ్యాడు.
2017లో, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ అతన్ని ఎంపిక చేసింది. అతను 2017 ఏప్రిల్ 22 న 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు [14] అతను IPL 2017 క్వాలిఫైయర్ 1 లో ముంబై ఇండియన్స్, పూణే సూపర్‌జెయింట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇందులో అతను 16 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు.
2018 జనవరిలో జరిగిన, 2018 IPL వేలంలో అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.[15] 2018 అక్టోబరులో అతను, 2018–19 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా సి జట్టులో ఎంపికయ్యాడు.[16]
2022 IPL వేలంలో, సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ₹8.75 కోట్లకు కొనుగోలు చేసింది. [17]
2022 ఆగస్టులో సుందర్, రాయల్ లండన్ వన్-డే కప్, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లాంకషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు. నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. [18]
2017 నవంబరులో, శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం భారత ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో సుందర్ ఎంపికయ్యాడు. [19] మరుసటి నెల ప్రారంభంలో, కేదార్ జాదవ్ స్నాయువుకు గాయం కావడంతో, అదే సిరీస్‌కు భారత వన్డే ఇంటర్నేషనల్ జట్టులో కూడా చేర్చుకున్నారు.[20] అతను 2017 డిసెంబరు 13 న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున తన వన్‌డే అరంగేట్రం చేసాడు [21] లహిరు తిరిమన్నె ను క్లీన్ బౌల్డ్ చేసి, అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి వికెట్ తీసుకున్నాడు. సుందర్ 2017 డిసెంబరు 24 న, 18 సంవత్సరాల 80 రోజుల వయస్సులో శ్రీలంకపై మ్యాచ్‌లో T20I అరంగేట్రం చేసాడు.[22] T20I లలో భారతదేశం తరపున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు, సుందర్.[23]
2018 మార్చిలో అతను, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో జరిగిన 2018 నిదహాస్ ట్రోఫీకి భారత జట్టులో ఎంపికయ్యాడు. పవర్‌ప్లేలో ఓవర్‌కు 6 పరుగుల కంటే తక్కువ ఇస్తూ వేసిన అతని బౌలింగుకు అతను చాలా మంది ప్రశంసలు అందుకున్నాడు. సిరీస్ సమయంలో, అతను తొలి 3-వికెట్ల హాల్‌ను సాధించాడు. T20Iలో ఆ రికార్డు సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అతని ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. [24] ఆ తర్వాత భారత ట్వంటీ20 జట్టులో సాధారణ సభ్యుడిగా మారాడు.[25]
సుందర్ మొదట్లో భారతదేశపు 2020-21 ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు. అయితే, తోటి బౌలర్లకు అనేక గాయాలు, కోవిడ్-19 మహమ్మారి సమయంలో అమలులో ఉన్న దిగ్బంధం పరిమితుల కారణంగా అతను జనవరి 15న గబ్బాలో జరిగిన సిరీస్ చివరి టెస్ట్ మ్యాచ్‌లో అనుకోకుండా తన మొదటి టెస్ట్ క్యాప్ అందుకున్నాడు.[26][27] అతని మొదటి టెస్ట్ వికెట్ స్టీవ్ స్మిత్. సుందర్ తానాడిన మొదటి టెస్టు ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్‌తో కలిసి 123 పరుగుల ఏడవ వికెట్ భాగస్వామ్యంలో 62 పరుగులు చేశాడు. ఇది భారత మొదటి ఇన్నింగ్సులో భారీ లోటు కాకుండా ఆపింది. చివరికి ఆ టెస్టులో భారత జట్టు గెలవడానికి కూడా గొప్పగా దోహదపడింది. [28] తొలి టెస్టులో చేసిన ఆ యాభైతో సుందర్, ఆస్ట్రేలియాలో టెస్టు అరంగేట్రంలోనే అర్ధ శతకం సాధించిన మూడో భారతీయుడిగా నిలిచాడు. [29]