విజయా బ్యాంక్ (Vijaya Bank) కర్ణాటక రాష్ట్రము మంగళూరులో ఎ.బి.శెట్టి, ఇతర ఔత్సాహిక రైతులు విజయా బ్యాంకును 23 అక్టోబర్1931 రోజు కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని వ్యవసాయ రంగములో ఉన్న వారికి బ్యాంకింగ్ అలవాటు, పొదుపు,వ్యవస్థాపకతను ప్రోత్సహించడం లక్ష్యంతో బ్యాంక్ ప్రారంభించబడినది. ఈ బ్యాంకు 1958 సంవత్సరంలో షెడ్యూల్డ్ బ్యాంకుగా మారింది. విజయా బ్యాంక్ 15 ఏప్రిల్1980 న జాతీయం చేయబడింది.[1] విజయా బ్యాంక్ ఏప్రిల్ 2020లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయబడింది.[2] విజయా బ్యాంక్ ప్రధాన కార్యాలయం కర్ణాటక రాజధాని బెంగుళూరు లో ఉన్నది.
దస్త్రం:Vijaya Bank.svg | |
రకం | పబ్లిక్ |
---|---|
ISIN | INE705A01016 |
పరిశ్రమ | బ్యాంకింగ్ ఆర్ధిక సేవలు |
స్థాపన | 23 అక్టోబరు 1931 మంగుళూరు, మద్రాస్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా |
స్థాపకుడు | ఎ. బి. శెట్టి |
విధి | విలీనం బ్యాంక్ ఆఫ్ బరోడా |
వారసులు | బ్యాంక్ ఆఫ్ బరోడా |
ప్రధాన కార్యాలయం | No. 41/2, ఎమ్ జి రోడ్, బెంగళూరు, కర్ణాటక , భారత దేశం |
Number of locations | 2,136 శాఖలు 2,155 ఎటిఎమ్ లు[3] (2018) |
సేవ చేసే ప్రాంతము | భారత దేశం |
సేవలు | కన్స్యూమర్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, ఆర్థిక,బీమా, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్, తనఖా రుణం, ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్ మెంట్ |
రెవెన్యూ | ₹14,190.45 crore (US$1.8 billion)[3] (2018) |
₹3,098 crore (US$390 million)[3] (2018) | |
₹727 crore (US$91 million)[3] (2018) | |
Total assets | ₹1,77,632.04 crore (US$22 billion)[3] (2018) |
Total equity | ₹10,627.19 crore (US$1.3 billion)[3] (2018) |
ఉద్యోగుల సంఖ్య | 16,079[3] (2018) |
మూలధన నిష్పత్తి | 13.90% (2018)[3] |
వెబ్‌సైట్ | www |
విజయా బ్యాంక్ స్థాపన 23 అక్టోబర్ 1931 విజయదశమి రోజు ఈ బ్యాంకును ప్రారంభించారు, అందువల్ల దీనికి విజయా బ్యాంక్ అని పేరు పెట్టారు. ఈ బ్యాంకులో 14 మంది వ్యవస్థాపకులు (ప్రమోటర్లు) ఉన్నారు, వారు దక్షిణ కన్నడ ప్రాంతం నుండి వచ్చారు., ఇందులో న్యాయవాదులు, భూస్వాములు, ఒకరు వైద్య రంగములో ఉన్న వారు.దక్షిణ కన్నడ లో ఉన్న బంట్స్ (అక్కడ ఉన్న తెగ) వీరందరూ ప్రధానంగా వ్యవసాయ రంగానికి చెందిన వారు కాబట్టి, ఈ బ్యాంకు "రైతుల ప్రయోజనం కోసం" అని స్థాపకుడు శెట్టి అన్నారు.[4]
1963-68 కాలంలో తొమ్మిది చిన్న బ్యాంకులు విజయా బ్యాంక్ లో విలీనం కావడంతో క్రమంగా పెద్ద అఖిల భారత బ్యాంకుగా మారింది. ఈ విలీనానికి, అప్పటి బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న స్వర్గీయ ఎం.సుందర్ రామ్ శెట్టి, బ్యాంక్ ఎదుగుదలకు కారణమైనాడు. ఈ బ్యాంకు 15 ఏప్రిల్1980 న జాతీయం చేయబడింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించిన శాఖలతో బ్యాంకు నెట్ వర్క్, మార్చి 2017 సంవత్సరం వరకు, బ్యాంక్ దేశవ్యాప్తంగా 2031 శాఖలు, 2001 ఏ టి ఎం ను కలిగి, సుమారు 4000 కస్టమర్ సేవా కేంద్రాలు( టచ్‌పాయింట్) లను కలిగి ఉంది. [5]
విజయా బ్యాంక్ సేవలు వినియోగ దారులకు ఏ రంగాలలో అందిస్తున్నది.[6]
గ్రామీణ బ్యాంకింగ్: విజయా బ్యాంక్ ప్రధాన లక్ష్యం రైతులలో బ్యాంకింగ్ అలవాట్లను ప్రేరేపించడం, పొదుపు ఖాతా, రుణాలు, రైతులకు ముందస్తు సదుపాయం, డిపాజిట్లు మొదలైన సేవలు ఉన్నాయి.
పర్సనల్ బ్యాంకింగ్: దీనిలో సేవింగ్స్ అకౌంట్, ఫిక్సిడ్ డిపాజిట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆర్ టిజిఎస్, నెఫ్ట్ సదుపాయం మొదలైనవి వ్యక్తిగత బ్యాంకింగ్ లో అందిస్తుంది.
ఎన్ ఆర్ ఐ బ్యాంకింగ్: దీనిలో ప్రవాస భారతీయులకు ఎన్ ఆర్ ఐ క్లయింట్ లకు రెమిటెన్స్ సదుపాయం, రుణాలు, డిపాజిట్ లు ఉన్నాయి.
విజయా బ్యాంక్ పిల్లల కోసం పొదుపు ఖాతాలు, మహిళా ఖాతాదారుల కోసం పథకం, జొరాస్ట్రియన్లు, బౌద్ధులు వంటి అల్పసంఖ్యాక వర్గాలకు రుణ సౌకర్యాలు వంటి వివిధ విభాగాలకు నిర్దిష్టమైన సేవలను అందిస్తుంది. మర్చంట్ బ్యాంకింగ్ సదుపాయం, బీమా పాలసీలు ఉన్నాయి.
విజయా బ్యాంక్ "వి-స్వశక్తి పథకం" లో మహిళా వ్యవస్థాపకత్వ అభివృద్ధిని ప్రోత్సహించడానికి అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, బ్యాంకు చిన్న వ్యాపారాలు, వృత్తిపరమైన లేదా స్వయం ఉపాధి, రిటైల్ వ్యాపారంలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ సౌకర్యాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మూలధనం (వర్కింగ్ క్యాపిటల్)ఆవశ్యకతను తీర్చడం కొరకు, వ్యాపార విస్తరణ కొరకు వ్యాపార రుణాలను అందించడం ద్వారా మహిళల యొక్క ఆర్థిక సాధికారత దిశగా ఒక మార్గాన్ని ఏర్పరచడం ఈ బ్యాంకు లక్ష్యం. [7]
విజయా బ్యాంక్ విద్యారుణాలలో ప్రతి ఒక్కరికీ సమాన విద్యావకాశాలను అందించడం కొరకు, దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన విజయా బ్యాంక్, భారతదేశం,విదేశాల్లోని విశ్వవిద్యాలయాల నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లను అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే ఎడ్యుకేషన్ లోన్ స్కీంను ప్రవేశపెట్టింది. ఇతర బ్యాంకులతో పోలిస్తే, విజయా బ్యాంక్ తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తుంది,సులభమైన తిరిగి చెల్లించే ప్రమాణం వంటి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. విద్యార్థుల అర్హతను బట్టి విద్యా రుణం మంజూరు చేస్తారు.[8] విద్యార్థులు విదేశాలలో చదవడానికి ఏదైనా ప్రీమియం ఇన్ స్టిట్యూట్ లో చేరడానికి గరిష్టంగా రూ. 80 లక్షల రుణ మొత్తం ఇస్తారు. విదేశాలు వెళ్లే విద్యార్థులకు ఏదైనా ఇతర విశ్వవిద్యాలయంలో లేదా కళాశాలలో చదువుకోవడానికి, విజయా బ్యాంక్ స్టడీ లోన్ గా తీసుకోబడే గరిష్ట రుణ మొత్తం రూ. 60 లక్షలు.[9]