విజయ్ నామ్దేవ్రావ్ వాడెట్టివార్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బ్రహ్మపురి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో వెనుకబడిన తరగతుల సంక్షేమం, విపత్తు నిర్వహణ, సహాయ & పునరావాస శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
- 1980-1981: NSUI కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు
- 1991-1993: జిల్లా పరిషత్ సభ్యుడు, గడ్చిరోలి
- 1996-1998: మహారాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్
- 1998-2004: శివసేన తరపున గడ్చిరోలి నుండి ఎమ్మెల్సీగా ఎన్నిక
- 2008-2009: అశోక్ చవాన్ మంత్రివర్గంలో నీటిపారుదల, గిరిజన సంక్షేమం, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి
- 2009-2010: చిమూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2009-2010 నవంబర్: అశోకరావు చవాన్ మంత్రివర్గంలో నీటిపారుదల, ఇంధనం, ఆర్థిక & ప్రణాళిక పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి
- 2010-2011: చంద్రపూర్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్
- 2008-2011: మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్, లిమిటెడ్ డైరెక్టర్
- 14 ఆగస్టు 2022 నుండి ప్రస్తుతం : ప్రతిపక్ష నాయకుడు[2]