విజేత (సినిమా)

విజేత
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాణం అల్లు అరవింద్
కథ రంజన్ రాయ్
తారాగణం చిరంజీవి,
భానుప్రియ ,
శారద,
సోమయాజులు
సంగీతం చక్రవర్తి
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం లోక్ సింగ్
నిర్మాణ సంస్థ గీతా క్రియేటివ్ ఆర్ట్స్
విడుదల తేదీ 23 అక్టోబరు 1985 (1985-10-23)(భారత్)
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

"విజేత "1985 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, భానుప్రియ, జె వి సోమయాజులు, శారద ప్రధాన పాత్రలు పోషించారు.గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 1981లో వచ్చిన బెంగాలీ చిత్రం" సాహెబ్ " కు రీమేక్. ఆలాగే తమిళంలో "ధర్మ ప్రభు "అనే పేరు తో డబ్బింగ్ చేయబడింది. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు .విజయవంతమైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలను అందుకుంది . అవార్డ్ లను పొందినది.

మధుసూధన రావు (చినబాబు) (చిరంజీవి) మధ్యతరగతికి చెందిన ఒక యువకుడు. ఫుట్ బాల్ ఆటలో అద్భుత ప్రతిభ ఉన్న చినబాబు ఒక రోజు అంతర్జాతీయ క్రీడలలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తూ ఉంటాడు. నరసింహం (జె.వి. సోమయాజులు) కి చిన్న కుమారుడు అయిన చినబాబు తన చిన్ననాటి నేస్తం అయిన ప్రియదర్శిని (భానుప్రియ) ని ఇష్టపడుతూ ఉంటాడు. తండ్రి నిరాశ పరుస్తూ ఉన్నా, తన గురువు, ప్రేయసి ల ప్రోత్సాహంతో చినబాబు ఫుట్ బాల్ క్రీడలో నానాటికీ ఆసక్తి కనబరుస్తుంటాడు. తమ సోదరి పెళ్ళికి కుమారులను నరసింహం డబ్బు అడగగా భార్యాలోలురు అయిన తన అన్నలు సహకరించరు. విసిగిపోయిన నరసింహం ఇల్లు అమ్మేస్తాడు. తన మొదటి సోదరి పంపినది అని చెప్పి తన తండ్రికి చినబాబు ధనాన్ని ఇచ్చి ఇల్లు అమ్మకుండా ఆదుకొంటాడు. కానీ ఆ పెళ్ళిలో చినబాబు కనిపించడు. తన మొదటి సోదరి పెళ్ళికి వచ్చి తను చినబాబుకి ఎటువంటి ధనసహాయం చేయలేదు అని తెలుసుకొన్న కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతారు. చినబాబే తన కిడ్నీ ఒక ధనిక వారసుడి ప్రాణాలని కాపాడటం కోసం అమ్మి ఆ డబ్బు సంపాదించాడని తెలుసుకొన్న నరసింహం, అతని కుటుంబ సభ్యులు, అతనిని ఆస్పత్రిలో కలవటంతో కథ ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]
  • మధుసూధనరావు (చినబాబు) గా చిరంజీవి
  • భానుప్రియ
  • శారద
  • జె. వి. సోమయాజులు
  • జంద్యాల
  • నూతన్ ప్రసాద్
  • రంగనాథ్
  • గిరిబాబు
  • శ్రీలక్ష్మి
  • అల్లు రామలింగయ్య
  • కైకాల సత్యనారాయణ
  • పి.జే శర్మ
  • చిడతల అప్పారావు
  • మాస్టర్ అల్లు అర్జున్.

పాటలు

[మార్చు]

చిత్రం లోని అన్ని పాటల రచయిత వేటూరి సుందర రామమూర్తి.

  • ఎంత ఎదిగిపోయావయ్యా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • జీవితమే ఒక పయనం , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • నీమీద నాకు , గానం.ఎస్ . జానకి
  • సిక్స్ వో క్లాక్ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి
  • యమహా యమహా , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • చిక్కు చిక్కు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యo సుశీల

పురస్కారాలు

[మార్చు]
సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1985 చిరంజీవి (రెండవసారి) ఫిలింఫేర్ పురస్కారం - ఉత్తమ తెలుగు నటుడు గెలుపు

ఇవి కూడా చూడండి

[మార్చు]

చిరంజీవి నటించిన సినిమాల జాబితా

బయటి లింకులు

[మార్చు]