వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ | |
---|---|
దర్శకత్వం | కిషోర్ (లడ్డా) |
నిర్మాత | ఎం. శ్రీధర్ రెడ్డి హెచ్. ఆనంద్ రెడ్డి ఆర్.కె. రెడ్డి |
తారాగణం | రాయ్ లక్ష్మీ మధునందన్ ప్రవీణ్ పూజిత పొన్నాడ బ్రహ్మాజీ |
ఛాయాగ్రహణం | వెంకట్ ఆర్ శాఖమూరి |
సంగీతం | హరి గౌరా |
నిర్మాణ సంస్థ | ఏబిటి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 15 మార్చి 2019 |
సినిమా నిడివి | 139 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ, 2019 మార్చి 15న విడుదలైన తెలుగు హర్రర్ కామెడీ సినిమా.[1][2][3][4] ఏబిటి క్రియేషన్స్ బ్యానరులో ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్.కె. రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ, మధునందన్, ప్రవీణ్, పూజిత పొన్నాడ, బ్రహ్మాజీ తదితరులు నటించగా, హరి గౌరా సంగీతం సమకూర్చాడు.[5][6]
ఈ సినిమా హైదరాబాదులో చిత్రీకరించబడింది.[7]
ఈ సినిమాలోని పాటలను హరి గౌరా స్వరపరిచాడు.[8]
ఫిబ్రవరి 19న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.[9][10]
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ సినిమాకి 1.5/5 రేటింగ్ ఇచ్చింది.[11] న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చింది.[12] 123 తెలుగు పత్రిక కూడా మిశ్రమ రివ్యూ ఇచ్చింది.[13]