![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శంకర్ మెల్కోటే | |
---|---|
దస్త్రం:SankarMelkote.jpg | |
వృత్తి | నటుడు, సీయీవో |
జీవిత భాగస్వామి | రమా మెల్కోటే |
మేల్కోటే గా ప్రసిద్ధి చెందిన శంకర్ మెల్కోటే ఒక సినీ నటుడు. ఎక్కువగా హాస్య పాత్రలు, సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిచిత్రమైన శ్రీవారికి ప్రేమలేఖతో చిత్రరంగానికి పరిచయమయ్యాడు. సుమారు 180 కి పైగా సినిమాల్లో నటించాడు. హైదరాబాదులోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవో అయిన మెల్కోటేకి మొదట్లో సినిమాల్లో నటించడం కేవలం హాబీగానే ఉండేది. ఆయన పనిచేసే గ్రూపుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ చిత్రాల్లోనే నటించే వాడు. క్రమంగా వేరే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు.[1]
ఆయన కాలేజీ రోజుల్లో నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆయన భార్య పేరు రమ.[2]
నాటక రంగంలో ఆయన కృషికి గాను 2008 లో యధువీర్ పురస్కారం బహుకరించారు.[3]