ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శరత్ బాబు | |
---|---|
జననం | సత్యం బాబు దీక్షిత్ 1951 జులై 31 |
మరణం | 2023 మే 22[1] | (వయసు 71)
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1973 – 2023 |
జీవిత భాగస్వామి | రమాప్రభ (-1988) |
శరత్‌బాబు (1951, జూలై 31 - 2023, మే 22) విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలలో తన 50 ఏళ్ల సినీ జీవితంలో 250కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు.[2] ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు (కె.ప్రభాకర్, కె.బాబూరావు) సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు.
హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించాడు.
బుల్లితెరపై అంతరంగాలు, ఎండమావులు తదితర ధారావాహికలలోనూ ఆయన నటించాడు. ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో కనిపించగా త్వరలో రిలీజ్ కానున్న మళ్లీ పెళ్లి (2023) సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు.
వీరు 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి సీతాకోక చిలుక, రెండవసారి ఓ భార్య కథ, మూడవసారి నీరాజనం సినిమాలలో తన నటనకు లభించాయి.
శరత్ బాబు 1951, జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించాడు. ఆయన జన్మనామం సత్యనారాయణ దీక్షిత్. అయితే ఇంట్లో ముద్దుగా సత్యం బాబుగా పిలుచుకునేవారు.
శరత్ బాబు సినిమాలలో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్ళు పెద్ద, వీరి వివాహం పద్నాలుగేళ్ల తర్వాత విడాకులతో అంతమైంది. 2007లో తెలుగు సినిమా.కాం (https://telugucinema.com)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ, నేను ఆసరా కోసం పెళ్ళిచేసుకుంటే, శరత్ బాబు అవసరానికి పెళ్ళిచేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్ళి అని చెప్పింది.[3]
శరత్‌బాబు తన 71 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023, మే 22న తుదిశ్వాస విడిచాడు.[7]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)