శివాజీ రాజా | |
---|---|
జననం | 1962 ఫిబ్రవరి 26[1] భీమవరం |
ఇతర పేర్లు | శివాజీ రాజా |
ప్రసిద్ధి | తెలుగు సినిమా హాస్యనటుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | అరుణ |
పిల్లలు | విజయ్ రాజా |
తండ్రి | జి. రామరాజు |
తల్లి | జి. చంద్రావతి |
శివాజీ రాజా (ఫిబ్రవరి 26 1962)[2] తెలుగు సినిమా టీవి నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన కళ్ళు అనే నాటిక ఆధారంగా రూపొందిన అదే పేరుగల చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు.[3] పెళ్ళిసందడి, సిసింద్రీ, ఘటోత్కచుడు, మురారి, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రలలో నటించాడు.
గుణ్ణం గంగరాజు నిర్మాణ సారథ్యంలో జెమినీ టీవీలో ప్రసారమై బాగా ప్రాచుర్యం పొందిన అమృతం ధారావాహికలో కొన్ని ఎపిసోడ్లలో ప్రధాన పాత్రయైన అమృతం పాత్రను పోషించాడు. మాటీవీలో కొద్దికాలం పాటు సంబరాల రాంబాబు అనే ధారావాహిక ను కూడా నిర్వహించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.
శివాజీ రాజా ఫిబ్రవరి 26, 1962 న రామరాజు, చంద్రావతి దంపతులకు జన్మించాడు. తండ్రి భీమవరం లోని డి.ఎన్.ఆర్ కళాశాలలో అటెండరుగా పని చేసేవాడు. శివాజీ రాజా హైదరాబాదులో పాలిటెక్నిక్ పూర్తి చేసి అక్కడే నటనలో శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక వారి కుటుంబం చెన్నైకి మారింది.[1]
శివాజీ రాజా మొదటి సినిమా కళ్ళు. ఆయన నటించిన ఇతర సినిమాలు.
ఆయన భార్య పేరు అరుణ.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)