శ్రీకారం | |
---|---|
![]() శ్రీకారం సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | కిషోర్ బి [1] |
రచన | కిషోర్ బి సాయిమాధవ్ బుర్రా (మాటలు) |
నిర్మాత | రామ్ అచంట గోపిచంద్ అచంట |
తారాగణం | శర్వానంద్ ప్రియాంక అరుల్ మోహన్ సాయి కుమార్ |
ఛాయాగ్రహణం | జె. యువరాజు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్[2] |
నిర్మాణ సంస్థ | 14 రీల్స్ ప్లస్ |
విడుదల తేదీs | 11 మార్చి, 2021 |
సినిమా నిడివి | 132 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శ్రీకారం, 2021 మార్చి 11న విడుదలైన తెలుగు సినిమా.[3] 14 రీల్స్ ప్లస్ బ్యానరులో రామ్ అచంట, గోపిచంద్ అచంట నిర్మించిన ఈ సినిమాకు బి. కిషోర్ దర్శకత్వం వహించాడు. ఇందులో శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, సాయి కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
2019 ఆగస్టులో ఈ సినిమా నిర్మాణం ప్రారంభమైంది. మిక్కీ జె. మేయర్ సంగీతం, మార్తాండ్ కె. వెంకటేష్ ఛాయాగ్రహణం, జె. యువరాజు ఎడిటింగ్ విభాగాల్లో పనిచేశారు. 2020, ఏప్రిల్ 24న విడుదలకావాల్సిన ఈ సినిమా కరోనా-19 మహమ్మారి[4] కారణంగా వాయిదాపడింది.[5]
ఉత్తమ బాలల చిత్రం, నంది పురస్కారం.
నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కార్తిక్ (శర్వానంద్) పండుగకు తన సొంత ఊరికి వస్తాడు. ఆ ఊరిలో అందర్నీ కలిసి, కొన్ని రోజులు వాళ్ళతో ఉండి మళ్ళీ నగరానికి వెళ్ళిపోతాడు. తనకి ప్రమోషన్ వచ్చి, అమెరికా వెళ్ళే అవకాశం వచ్చినా కూడా తన మనసు ఊరు, పొలం మీద ఉంటుంది. దాంతో ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయడంకోసం ఊరికి వస్తాడు. కార్తీక్ ఊరికి వచ్చేయడం అతని తండ్రి కేశవులు (రావు రమేష్) కి నచ్చదు. సరైన బతుకు లేని వ్యవసాయాన్ని నమ్ముకోవద్దని కొడుకుకు నచ్చచెప్పబోతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
2018, అక్టోబరులో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అధినేతలు రామ్, గోపి అచంట ఒక ప్రాజెక్ట్ కోసం నానిని సంప్రదించారు. కిషోర్ రెడ్డి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రైతు పాత్ర ప్రధానంగా ఉంది.[6] అయితే, ఈ పాత్రకు శర్వానంద్‌ను ఖరారు చేశారు.[7] 2019, జూన్ 30న శ్రీకారం పేరుతో 14 రీల్స్ ప్లస్ కార్యాలయంలో పూజా వేడుకతో లాంఛనంగా ప్రారంభించారు. సినీ దర్శకుడు సుకుమార్ మొదటి షాట్ కు క్లాప్ కొట్టాడు.[8]
2019, జూలైలో ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో నటించింది.[9] 2019, ఆగస్టులో హైదరాబాదులో సినిమా షూటింగ్ ప్రారంభించారు.[10] 2019, నవంబరులో అనంతపురం, తిరుపతి సమీపంలో గ్రామ సన్నివేశాలను చిత్రీకరించారు.[11][12]
2020, మార్చి నెలలో హైదరాబాదులో సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరగాల్సివుంది.[13] అయితే, భారతదేశంలో కోవిడ్-19 పాండమిక్ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. 2020, అక్టోబరులో షూటింగ్ పునఃప్రారంభమై, తిరుపతిలో 20 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసింది.[14]
Untitled | |
---|---|
ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతం స్వరపరిచాడు. 2020, నవంబరు 5న మొదటి సింగిల్ ప్రోమో "భలేగుంది బాలా" అని విడుదల చేశారు.[15] దీనిని పెంచల్ దాస్ రాయగా, నూతన మోహన్ పాడింది. 2020, నవంబరు 9న లాహరి మ్యూజిక్ ద్వారా పూర్తిపాట విడుదలయింది.[16] సనాపతి భరద్వాజ్ పాత్రుడు రాయగా, అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజు పాడిన "సందళ్ళే సందళ్ళే" పాట ప్రోమోను 2021, జనవరి 7న ఆవిష్కరించారు. పూర్తిపాట అదే రోజు విడుదలైంది.[17]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "భలేగుంది బాలా (రచన: పెంచల్ దాస్)" | పెంచల్ దాస్ | పెంచల్ దాస్, నూతన మోహన్ | 4:27 |
2. | "సందళ్ళే సందళ్ళే (రచన: సనాపతి భరద్వాజ్ పాత్రుడు)" | సనాపతి భరద్వాజ్ పాత్రుడు | అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజు | 3:41 |
3. | "హేయ్ అబ్బాయి (రచన: కృష్ణకాంత్)" | కృష్ణకాంత్ | హైమత్, నూతన మోహన్ | 3:42 |
4 . శ్రీకారం పృద్వి చంద్ర
(టైటిల్ సాంగ్)
రచన: రామజోగయ్య శాస్ర్తి
ఈ సినిమా 2020 సంక్రాంతి సందర్భంగా విడుదలకావాల్సి ఉంది. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు విడుదలవుతున్న కారణంగా ఈ సినిమా విడుదలను వేసవికి వాయిదా వేశారు.[18] 2020, ఫిబ్రవరి 1న జరిగిన సమావేశంలో 2020, ఏప్రిల్ 24న సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.[19] కరోనా-19 మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. 2020 సెప్టెంబరులో, చిత్రనిర్మాతలు ఓవర్-ది-టాప్ (ఓటిటి) ద్వారా సినిమాని విడుదల చేయడానికి చర్చలు జరిపారు.[20] చివరగా 2021, మార్చి 11న థియేటర్లలో విడుదలైంది.
"ఇది, వ్యవసాయంపై వచ్చిన రొటీన్ ఫిల్మ్ అయినప్పనటికి, మంచి కథాంశం, స్క్రీన్ ప్లే ఉండడంవల్ల ఆదరణ పొందగలదు" అని ది హిందూ పత్రికకు చెందిన వై. సునీతా చౌదరి రాసింది.[21] టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు చెందిన విమర్శకుడు తదాగడ్ పతి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చాడు. మన దేశంలోని రైతుల దుస్థితిపై వెలుగులు నింపడానికి, భవిష్యత్ తరానికి ఇది ఎలా ఆచరణీయమైన వృత్తిగా ఉంటుందో చూపించడానికి శ్రీకారం సినిమా ఒక మంచి ప్రయత్నం" అని రాశాడు.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)