శ్రీవిష్ణు | |
---|---|
జననం | విశాఖపట్నం | 1985 ఆగస్టు 30
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2012–నేటి వరకు |
జీవిత భాగస్వామి | ప్రశాంతి |
శ్రీ విష్ణు ఒక తెలుగు నటుడు. అతను బాణం, సోలో లో కొన్ని చిన్న పాత్రలతో నటుడిగా పరిచయమయ్యాడు. 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో 'రాయల్ రాజు'గా తరువాత సంవత్సరం సెకండ్ హ్యండ్ చిత్రం, 2016లో అప్పట్లో ఒకడుండేవాడు తో మంచి గుర్తింపు పొందాడు.[1]
శ్రీవిష్ణు విశాఖపట్నం లో చదివాడు. విశాఖపట్నం గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ పట్టా పొందాడు. కాలేజీలో శ్రీవిష్ణు నాటకబృందంలో సభ్యుడు. క్రికెట్ అంటే కూడా అతనికి ఆసక్తి. యువకుడిగా ఉన్నప్పుడు అతను ఆంధ్ర ప్రదేశ్ అండర్ -19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.[1]
బాణం, సోలో లో కొన్ని చిన్న పాత్రలతో నటుడిగా పరిచయమయ్యాడు. 2013 లో, ప్రేమా ఇష్క్ కాదల్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించటానికి దర్శకుడు పవన్ సాదినేనిని కలుసుకున్నాడు. 2014 లో నారా రోహిత్ నటించిన ప్రతినిథి సినిమాలో ఒక హోం మంత్రి కుమారుడిగా నటించారు.
కొన్ని చిన్న పాత్రలలో నటించిన తరువాత, 2016 లో అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు.
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | దర్శకుడు | గమనిక |
---|---|---|---|---|
2009 | బాణం | |||
2011 | సోలో | గౌతమ్ స్నేహితుడు | పరశురామ్ | |
2012 | కాదల్ సొదప్పువది ఎప్పిడి | రూపేష్ | తమిళ చిత్రం | |
లవ్ ఫెయిల్యూర్ | ||||
నా ఇష్టం | గణేష్ స్నేహితుడు | |||
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ | అశొక్ | |||
2013 | ప్రేమ ఇష్క్ కాదల్ | రయల్ రాజు | పవన్ సాదినేని | |
సెకండ్ హ్యాండ్ | చైతన్య | కిషోర్ తిరుమల | ||
ఒక్కడినే | శైలజ సోదరుడు | |||
2014 | ప్రతినిధి | శ్రీకర్ | ప్రశాంత్ మండవ | |
2015 | సన్నాఫ్ సత్యమూర్తి | విరాజ్ ఆనంద్ స్నేహితుడు | త్రివిక్రమ్ శ్రీనివాస్ | |
అసుర | అతిది పాత్ర | |||
2016 | అప్పట్లో ఒకడుండేవాడు | రైల్వే రాజు | సాగర్ కె.చంద్ర | |
జయమ్ము నిశ్చయమ్మురా | కాంతా రావు | కనుమూరి శివ రాజ్ | ||
2017 | మా అబ్బాయి[2] | వట్టి కుమార్ | ||
ఉన్నది ఒకటే జిందగీ | వాసు | తిరుమల కిషోర్ | ||
మెంటల్ మదిలో | అరవింద్ కృష్ణ | వివేక్ ఆత్రేయ | ||
2018 | నీదీ నాదీ ఒకే కథ | సాగర్ | వేణు ఊడుగుల | |
వీర భోగ వసంత రాయలు | వీర భోగ వసంత రాయలు/ నిఖిల్ | ఆర్. ఇంద్రసేన | ||
2019 | బ్రోచేవారెవరురా | రాహుల్ | ||
తిప్పరా మీసం | మణిశంకర్ | |||
2021 | గాలి సంపత్ | సూరి | ||
రాజ రాజ చోర | భాస్కర్ | |||
అర్జున ఫల్గుణ | అర్జున | |||
2022 | భళా తందనానా | చంద్ర | [3] | |
అల్లూరి | ఎస్.ఐ. అల్లూరి సీత రామరాజు | |||
2023 | సామజవరగమన | |||
2024 | ఓం భీమ్ బుష్ | [4] | ||
శ్వాగ్ |