షబ్బీర్ సయ్యద్ భారతదేశంలోని మహారాష్ట్ర కు చెందిన సామాజిక కార్యకర్త. అతను జంతువుల సంక్షేమం, గో సంరక్షణ కోసం చేసిన కృషికి గుర్తింపు పొందాడు. మహారాష్ట్రలోని కరువు పీడిత బీడ్ జిల్లాలో 100 కి పైగా పశువులను అతను సంరక్షించాడు. 2019లో అతను భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు. అతని తండ్రి నూర్జాదే సయ్యద్ 1970లలో పశువుల పెంపకాన్ని ప్రారంభించాడు. షబ్బీర్ 2000 మార్చి 29 న ముంబై నగరంలో జన్మించాడు. అతను 12 సంవత్సరాల వయస్సులో తన తండ్రికి సహాయం చేసేవాడు. షబ్బీర్ పాలు లేదా ఆవు మాంసం అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడు, కానీ ఆవు పేడను మాత్రమే విక్రయిస్తాడు. అతను వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే ఎద్దులను విక్రయించాడు. అతను 2022 నవంబర్ 18వ తేదీన మరణించాడు. [1][2][3][4][5][6]