షర్బానీ ముఖర్జీ | |
---|---|
జననం | భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1977 - 2015 |
తల్లిదండ్రులు | రోనో ముఖర్జీ |
షర్బానీ ముఖర్జీ ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ చిత్రాలలో, కొన్ని మలయాళ భాషా చిత్రాలలో కూడా నటించింది.[1]
ఆమె రోనో ముఖర్జీ కుమార్తె, ముఖర్జీ-సమర్త్ కుటుంబంనకుచెందినది.[2] ఆమె బాబాయిలు దేబ్ ముఖర్జీ, జాయ్ ముఖర్జీ, షోము ముఖర్జీ. ఆమె తాత, సషాధర్ ముఖర్జీ, ఒక సినిమా నిర్మాత. ఆమె నాయనమ్మ సతీరాణి దేవి అశోక్ కుమార్, అనూప్ కుమార్, కిషోర్ కుమార్ ల సోదరి. ఆమె బంధువులు నటీమణులు రాణి ముఖర్జీ, కాజోల్, తనీషా, దర్శకుడు అయాన్ ముఖర్జీ, ప్రఖ్యాత ఎంఐటి బీజగణిత జియోమీటర్ దవేష్ మౌలిక్. ఆమె సోదరుడు సామ్రాట్ ముఖర్జీ కూడా బాలీవుడ్, బెంగాలీ నటుడు. [3]
షర్బానీ ముఖర్జీ బోర్డర్ సినిమాతో తెరంగేట్రం చేసింది. షాజియా మన్సూర్ పాడిన "ఘర్ ఆజా సోనియా" పాటలో ఆమె సమీర్ సోనీ సరసన కనిపించింది. పలు యాడ్స్‌లో కూడా నటించింది.[4] 2008 నాటికి ఆమె తన దృష్టిని మోలీవుడ్ వైపు మార్చింది, ఆమె తొలి మలయాళ చిత్రం రాకిలిపట్టు ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన మిస్టరీ-థ్రిల్లర్ చిత్రం, జ్యోతిక, టబు, ఇషిత్తా అరుణ్‌లతో కలిసి నటించింది. ఆమె సూఫీ పరంజ కథ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.[5] ఇది మలయాళ నవతరంగం నిర్వచించే చలనచిత్రాలలో ఒకటిగా విస్తృతంగా పరిగణించబడుతుంది.[6]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనిక |
---|---|---|---|---|
1997 | బార్డర్ | ఫూల్కన్వార్ | హిందీ | అరంగేట్రం |
2000 | స్నేగితియే | రాధిక | తమిళం | ద్విభాషా చిత్రం మలయాళంలో రాకిలిప్పటుగా చిత్రీకరించబడింది |
2001 | మిట్టి | పూజ | హిందీ | |
2002 | అన్ష్: ది డెడ్లీ పార్ట్ | శ్వేత | హిందీ | |
2003 | కైసే కహూన్ కే... ప్యార్ హై | ప్రియా | హిందీ | |
2003 | ఆంచ్ | విద్య | హిందీ | |
2006 | ధరతీ కహే పుకార్ కే | రజని | భోజ్‌పురి | |
2007 | రాకిలిపట్టు | రాధిక | మలయాళం | మలయాళ రంగ ప్రవేశం |
2008 | మోహన్ దాస్ | కస్తూరి | హిందీ | |
2010 | 332 ముంబై టు ఇండియా | తనూ | హిందీ | |
2010 | సూఫీ పరంజ కథ | కార్తీ, సుహార | మలయాళం | |
2010 | ఆత్మ కథ | మేరీ | మలయాళం | |
2015 | నముక్కొరే ఆకాశం | మలయాళం |