దస్త్రం:Sean Abbott playing for the Sydney Sixers.jpg 2016 లో సిడ్నీ సిక్సర్స్‌తో అబ్బాట్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షాన్ ఆంథోనీ అబ్బాట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | విండ్సర్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా | 29 ఫిబ్రవరి 1992|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 184 cమీ. (6 అ. 0 అం.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 205) | 2014 అక్టోబరు 7 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2023 సెప్టెంబరు 7 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 77 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 68) | 2014 అక్టోబరు 5 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 3 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 77 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11–present | న్యూ సౌత్ వేల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2012/13 | సిడ్నీ థండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013/14– | Sydney Sixers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021, 2023 | సర్రే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | సన్ రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | Manchester Originals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 మార్చి 30 |
షాన్ ఆంథోనీ అబ్బాట్ (జననం 1992 ఫిబ్రవరి 29) న్యూ సౌత్ వేల్స్‌లోని విండ్సర్కు చెందిన ఆస్ట్రేలియన్ ప్రొఫెషనల్ క్రికెటరు. అతను వైట్ బాల్ క్రికెట్లో అంతర్జాతీయంగా తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. బౌల్ఖం హిల్స్ క్రికెట్ క్లబ్‌కు జూనియర్ క్రికెట్లో ఆడిన తర్వాత, అతను పర్రమట్టా జిల్లా తరపున గ్రేడ్ క్రికెట్ ఆడేందుకు పురోగమించాడు. అబ్బాట్ పాఠశాల విద్య కాజిల్ హిల్‌లోని గిల్రాయ్ కాలేజీలో పూర్తి చేశాడు. అతను కుడిచేతి వాటం బ్యాటింగు చేసే ఆల్ రౌండరు.
అతను 2010-11 రియోబీ వన్-డే కప్‌లో 2010 అక్టోబరు 17న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో న్యూ సౌత్ వేల్స్ తరపున తన తొలి జాబితా A మ్యాచ్ ఆడాడు. కానీ ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేదు, బ్యాటింగూ చేయలేదు. [2] సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అడిలైడ్ ఓవల్‌లో సౌత్ ఆస్ట్రేలియాపై ఫస్ట్-క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. [3]
అబ్బాట్ సిడ్నీ గ్రేడ్ క్రికెట్ పోటీలో పర్రమట్టా, సిడ్నీ విశ్వవిద్యాలయం, బిగ్ బాష్ లీగ్‌లోని రెండు సిడ్నీ జట్లకు, 2011-12, 2012-13 సీజన్లలో సిడ్నీ థండర్, 2013-14లో సిడ్నీ సిక్సర్ల తరపునా ఆడాడు. [4]
2014 నవంబరు 25న జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా, అబ్బాట్ వేసిన బౌన్సరు ఫిలిప్ హ్యూస్ మెడకు తగిలింది. హ్యూస్ రెండు రోజుల తర్వాత సిడ్నీలోని సెయింట్ విన్సెంట్స్ హాస్పిటల్లో వెన్నుపూస ధమని విచ్ఛేదనం కారణంగా మరణించాడు.[5] అనేక సంతాప సందేశాలలో అబ్బాట్‌కు మద్దతు పలికాయి. [6] అతను హ్యూస్ అంత్యక్రియలకు ముందు రోజు శిక్షణకు తిరిగి వచ్చి, 2014 డిసెంబరు 8న ప్రారంభమయ్యే షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో క్వీన్స్‌లాండ్‌తో ఆడాడు. క్వీన్స్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6/14 తో మ్యాచ్-విజేతగా నిలిచాడు. [7]
2015 జనవరిలో అబ్బాట్, ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. [8] 2015 వేలంలో అబ్బాట్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. [9]
ఆరవ BBL లో 10 గేమ్‌లకు పైగా 20 వికెట్లు తీసిన తర్వాత అబ్బాట్, సిడ్నీ సిక్సర్స్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. సిక్సర్స్కే చెందిన బ్యాట్స్‌మెన్ డేనియల్ హ్యూస్‌తో కలిసి ఈ అవార్డును పంచుకున్నాడు. [10]
2017 ఆగస్టు 28న బిగ్ బాష్ లీగ్ మరో మూడు ఎడిషన్ల కోసం అబ్బాట్ క్లబ్‌తో మళ్లీ సంతకం చేసినట్లు సిక్సర్స్ ప్రకటించింది. [11] 2017–18 JLT వన్-డే కప్‌లో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడి, 12 వికెట్లు పడగొట్టాడు. ఇది జట్టులోని ఆటగాళ్లందరి లోకీ ఇది అత్యధికం.[12]
2019-20 మార్ష్ వన్-డే కప్‌కు ముందు, టోర్నమెంటు సమయంలో గమనించాల్సిన ఆరుగురు క్రికెటర్లలో అబ్బాట్ ఒకడు. [13] 2020 నవంబరులో, 2020–21 షెఫీల్డ్ షీల్డ్ సీజన్ నాలుగో రౌండ్లో, అబ్బాట్ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో తన తొలి సెంచరీని సాధించాడు. [14]
2021 ఏప్రిల్‌లో ఇంగ్లీష్ కౌంటీ సర్రే సీజన్లో ప్రత్యేకంగా T20 వైటాలిటీ బ్లాస్టు పోటీ కోసం అబ్బాట్‌ను తమ రెండవ విదేశీ ఆటగాడిగా సంతకం చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 మే 27న ది ఓవల్‌లో గ్లౌసెస్టర్‌షైర్‌తో తన ఫస్టు క్లాస్ రంగప్రవేశం చేశాడు. గాయం కారణంగా సర్రేలో ఆడే సమయం తగ్గిపోయింది. కానీ, 2023లో కౌంటీకి మళ్లీ సంతకం చేశాడు [15]
2022 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు కోసం వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని కొనుగోలు చేసింది. [16] 2022 ఏప్రిల్‌లో, ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం అతన్ని మాంచెస్టర్ ఒరిజినల్స్ కొనుగోలు చేసింది. [17]
అతను 2014 అక్టోబరు 5న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు [18] రెండు రోజుల తర్వాత అతను, UAEలో పాకిస్తాన్ పైనే వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం కూడా చేశాడు. [19] అతను 2014 నవంబరు ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తరపున మరో రెండు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడాడు.
అతను, 2015లో CA అలన్ బోర్డర్ మెడల్ వేడుకలో బ్రాడ్‌మాన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చింది. [20]
2019లో, ఐదు సంవత్సరాల విరామం తర్వాత అబ్బాట్ ఆస్ట్రేలియా యొక్క అంతర్జాతీయ జట్టుకు తిరిగి వచ్చి, ఆప్టస్ స్టేడియంలో పాకిస్తాన్‌పై నాలుగు ఓవర్లలో 2/14 స్కోర్ తీసుకొన్నాడు. [21] 2020 జూలై 16న, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు శిక్షణను ప్రారంభించడానికి 26 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక జట్టులో అబ్బాట్‌ను చేర్చారు. [22] [23] 2020 ఆగస్టు 14న, టూరింగ్ పార్టీలో అబ్బాట్‌ను చేర్చుకోవడంతో మ్యాచ్‌లు జరుగుతాయని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. [24] [25]
2020 నవంబరులో భారత్‌తో జరిగే సిరీస్‌కు ఆస్ట్రేలియా టెస్టు జట్టులో అబ్బాట్‌ను ఎంపిక చేశారు. [26]
2022 జూలైలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు, జింబాబ్వేతో జరిగిన సిరీస్‌కూ ఆస్ట్రేలియా జట్టులో అబ్బాట్‌ని చేర్చారు [27]
2022 సెప్టెంబరులో అబ్బాట్‌ను భారత్‌తో జరిగే T20i సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులోకి పిలిచారు. [28]