షామీర్‌పేట్ చెరువు

షామీర్‌పేట్‌ చెరువు
ప్రదేశంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు17°36′36″N 78°33′47″E / 17.610°N 78.563°E / 17.610; 78.563
రకంReservoir
ప్రవహించే దేశాలుభారతదేశం

షామీర్‌పేట్‌ చెరువు తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదులో ఉన్న చెరువు. సికింద్రాబాద్ కి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చెరువు నిజాం పాలనలో నిర్మించబడింది.

ఈ చెరువు పక్షి పరిశీలనా కేంద్రంగా అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ సరస్సు సమీపంలో తెలంగాణా ప్రభుత్వంచే ఒక రిసార్టు నడపబడుతునది. ఈ సరస్సు సమీపంలోనే హైదరాబాదు ఔటర్ రింగు రోడ్డు ఉంది.[1] ఈ సరస్సు సమీపంలో అనేక రిసార్టులు, ప్రైవేడు డాబాలు ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక సంస్థలైన నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్, బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెంకాలనీ అండ్ సైన్స్ వంటివి ఈ సరస్సు సమీపంలోనే కలవి.[2] ఈ సరస్సు సమీపంలో జవహర్ జింకల పార్కు, ఉంది. ఇచట జింకలు, నెమళ్ళు, యితర వివిధ రకాల పక్షులు కూడా ఉంటాయి. ఈ జింకల ఉద్యానవనం తెలంగాణ ప్రభుత్వంచే నిర్వహింపబడుతున్నది.[3]

అనేక మంది ప్రజలు ఈ ప్రాంతాన్ని పిక్నిక్ స్పాట్ గా ఉపయోగిస్తున్నారు. కొన్ని సినిమాల షూటింగులు కూడా జరిగాయి.[ఆధారం చూపాలి]

షారిమ్‌పేట police పర్యాటకుల రక్షణకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అనేక వార్నిగ్ బోర్డులను సరస్సు చుట్టూ అమర్చారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Not the poorer cousin, anymore". The Hindu. Chennai, India. 2 April 2006. Archived from the original on 3 జూలై 2007. Retrieved 19 మార్చి 2017.
  2. "Birla Institute of Technology and Science, Pilani - Hyderabad".
  3. "APonline". Archived from the original on 2014-06-15. Retrieved 2017-03-19.
  4. "Drowning of people in Shamirpet lake". The Hindu. Chennai, India. 11 June 2008. Archived from the original on 13 జూన్ 2008. Retrieved 19 మార్చి 2017.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.