సంతోషి మాత | |
---|---|
సంతృప్తి దేవత | |
దేవనాగరి | संतोषी माता |
అనుబంధం | దేవి |
నివాసం | Svānandaloka |
మంత్రం | ఓం శ్రీ సంతోషి మహామాయే గజానంద్ దాయిని శుక్రవార ప్రియే దేవీ నారాయణి నమోస్తుతే |
ఆయుధములు | కత్తి, బియ్యంతో కూడిన బంగారు కుండ, త్రిశూలం |
Day | శుక్రవారం |
తోబుట్టువులు | శుభ్, లాభ్ |
వాహనం | పులి, ఆవు లేదా కమలం |
పాఠ్యగ్రంథాలు | జై సంతోషి మా (చిత్రం) |
తండ్రి | వినాయకుడు |
తల్లి | రిద్ధి, సిద్ధి |
సంతోషిమాత (హిందీ: संतोषी माता) హిందూ దేవత. సంతోషం, సంతృప్తికి సంతోషిమాత అధిదేవతగా పరిగణిస్తారు. ఆమెను ముఖ్యంగా ఉత్తర భారతదేశం, నేపాల్ మహిళలు ఎక్కువగా పూజిస్తారు. స్త్రీలు వరుసగా 16 శుక్రవారాల్లో చేసే సంతోషి మా వ్రతంతో అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.[1]
ఆమె దుర్గాదేవి అవతారం అని భక్తుల విశ్వాసం. హిందూ సనాతన ధర్మంలో సంతోషిమాత పూజకు విశిష్ట స్థానం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాలలోని వారు శుక్రవారం సంతోషిమాతను పూజిస్తారు. పులుపు తినకూడదు అని నియమం ఉంది. 1975లో వచ్చిన జై సంతోషి మా అనే హిందీ సినిమా వల్ల సంతోషి మాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సంతోషిమాత వ్రతకథను ఇతివృత్తంగా ఈ సినిమాని చిత్రీకరీంచారు. ఇందులో సత్యవతి అనే భక్తురాలు సంతోషిమాత వ్రతం చేయడం వల్ల సౌభాగ్యాన్ని పొందుతుంది. సంతోషిమాత వినాయకుని మానసపుత్రిక.
భారతదేశం అంతటా, విదేశాలలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఉత్తరాదిన సంతోషిమాతకు విపరీతమైన ఆదరణ ఉన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ సంతోషిమాత ఆలయాలున్నాయి. కాగా ప్రసిద్ధి చెందిన శ్రీ సంతోషి మాతా మందిరాలు కొన్ని..
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)