సరిలేరు నీకెవ్వరు | |
---|---|
దర్శకత్వం | అనిల్ రావిపూడి |
రచన | అనిల్ రావిపూడి |
నిర్మాత | |
తారాగణం | |
ఛాయాగ్రహణం | రత్నవేలు |
కూర్పు | బిక్కిన తమ్మిరాజు |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థలు | శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 11 జనవరి 2020 |
సినిమా నిడివి | 169 ని[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹750 million[2] |
బాక్సాఫీసు | ₹750 billion |
సరిలేరు నీకెవ్వరు 2020 లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో మహేష్ బాబు, విజయశాంతి, రష్మికా మందన్న, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎ. కే ఎంటర్టైన్మెంట్స్ తరపున దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాడు. 2020 జనవరి 11 న సంక్రాంతికి ముందు ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది.[3]
కర్నూలు వైద్యకళాశాలలో ప్రొఫెసరుగా పనిచేస్తుంటుంది భారతి. అవతలి వారు ఎంత శక్తివంతులైనా నిజానికి నిర్భయంగా చెప్పగల వ్యక్తి. ఆమె కూతురికి వివాహం నిర్ణయిస్తుంది. ఆమె భర్త, పెద్ద కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించినా ఆమె చిన్న కొడుకు అజయ్ కూడా సైన్యంలో చేరుస్తుంది. మేజర్ అజయ్ కృష్ణ భారత సరిహద్దులో సైన్యంలో మేజర్ గా పనిచేస్తుంటాడు. భారతి కొడుకు అజయ్ తన చెల్లెలు వివాహం కోసం వెళ్ళాలనుకుంటాడు. మధ్యలో ఒకానొక ఉగ్రవాద ఆపరేషన్ కోసం వెళ్ళిన అతను తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోతాడు. సైన్యాధికారి మానవతా ధృక్పథంతో అజయ్ కృష్ణను సైన్యం తరఫున భారతి కుటుంబానికి వెళ్ళి సాయం చేయమంటాడు. అతనికి తోడుగా మరో సైనికుడు ప్రసాద్ కూడా వెళతాడు. దారిలో వీరికి సంస్కృతి అనే అల్లరిపిల్ల తారసపడుతుంది. పెళ్లి విషయంలో సహాయం చెయ్యడానికి వచ్చిన హీరో భారతి విలన్ చేతిలో చిక్కుకుని ఇబ్బంది పడుతుంది, అని తెలుసుకొని వారికి అండగా నిలబడతాడు.విలన్ రాజకీయ నాయకుడు అతను భారతి కుటుంబాన్ని వెంబడిస్తూ ఉంటాడు, , దానిని హీరో అడ్డుకుంటాడు. విలన్ నేరాల ఆధారాలను పోలీసులకు ఇవ్వకుండా తనతో పాటు ఆర్మీ కి తీసుకువెళ్ళి అసలైన దేశభక్తి,క్రమశిక్షణ విలువలు తెలియచేస్తాడు. విలన్ తన నేర వైఖరిని మార్చుకొని మంచిగా నడవడంతో కథ సుఖంతం అవుతుంది.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "మైండ్ బ్లాక్" | బ్లేజ్, రెనినా రెడ్డి | 4:23 | ||||||
2. | "సూర్యుడివో చంద్రుడివో" | బి ప్రాక్ | 4:32 | ||||||
3. | "హి ఈజ్ సో క్యూట్" | మధుప్రియ | 3:30 | ||||||
4. | "సరిలేరు నీకెవ్వరు" | శంకర్ మహదేవన్ | 4:27 | ||||||
5. | "డాంగ్ డాంగ్" | నకాష్ అజీజ్, లవిటా లోబో | 4:14 | ||||||
21:06 |
20201 సైమా అవార్డులు