సాహసవీరుడు - సాగరకన్య | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
రచన | పరుచూరి సోదరులు |
నిర్మాత | బూరుగుపల్లి శివరామకృష్ణ |
తారాగణం | వెంకటేష్, శిల్పా శెట్టి, మాలాశ్రీ |
ఛాయాగ్రహణం | ఎ. విన్సెంట్ అజయ్ విన్సెంట్ |
కూర్పు | కె.ఎం. మార్తాండ్ మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 9 ఫిబ్రవరి 1996 |
సినిమా నిడివి | 139 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సాహసవీరుడు - సాగరకన్య 1996, ఫిబ్రవరి 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాణ సారథ్యంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, శిల్పా శెట్టి, మాలాశ్రీ నటించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించాడు.[1] బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ఈ చిత్రం, 1997లో సాగర కన్య పేరుతో హిందీలోకి అనువాదం చేయబడింది.[2]
రవిచంద్ర (వెంకటేష్), సాగర కన్య (శిల్ప శెట్టి) అనే మత్స్యకన్య గురించిన ఈ చిత్రమిది. బంగారు రాజు (కైకాల సత్యనారాయణ) ఓడను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నిధిని కనుగొనడంకోసం మంత్రగత్తెను సంప్రదిస్తాడు. ఒక మత్స్యకన్య సహాయంతో నిధిని తిరిగి పొందవచ్చని తెలుసుకుంటాడు. ప్రమాదవశాత్తు ఒకరోజు సముద్రం నుండి వచ్చిన మత్స్యకన్య శరీరాన్ని కోల్పోయి, ఒక అందమైన అమ్మాయిగా మారుతుంది. ఆమెపై నీరు పడినప్పుడు మళ్ళీ మత్స్యకన్యగా మారుతుంది. రవిచంద్ర దగ్గరికి వచ్చిన మత్స్యకన్యకు బంగారం అని పేరు పెడుతారు. దాంతో బంగారం రవిని ప్రేమిస్తుంది. మత్స్యకన్య గురించి తెలుసుకున్న మంత్రగత్తె, ఆమె ద్వారా నిధిని కనుగొనే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో బంగారం అనేక ఇబ్బందులు పడుతుంది. రవి సాహసంతో మత్స్యకన్యను రక్షిస్తాడు. రవి, అతని బంధువులను కలిపి బంగారం తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతుంది.
సాహసవీరుడు - సాగరకన్య | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 1996 | |||
Genre | పాటలు | |||
Length | 30:00 | |||
Label | మెలోడి మేకర్స్ | |||
Producer | ఎం.ఎం. కీరవాణి | |||
ఎం.ఎం. కీరవాణి chronology | ||||
|
ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. అన్నిపాటలు విజయం సాధించాయి. మెలోడి మేకర్స్ ఆడియో కంపెనీ నుండి పాటలు విడుదలయ్యాయి.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అబ్బబ్బో అబ్బబ్బో (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 5:03 |
2. | "ఘడియ ఘడియకో ముద్దు (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:10 |
3. | "మీనా మీనా (రచన: వేటూరి సుందరరామ్మూర్తి)" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎం. ఎం. శ్రీలేఖ | 5:10 |
4. | "శ్రీనాథుని కవితలోని (రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు)" | జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:56 |
5. | "అప్పనంగ చిక్కెనమ్మ (రచన: వెన్నెలకంటి)" | వెన్నెలకంటి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సింధు | 4:52 |
6. | "పెట్టమంది పెట్టమంది (రచన: వెన్నెలకంటి)" | వెన్నెలకంటి | మనో, కె.ఎస్. చిత్ర | 5:19 |
మొత్తం నిడివి: | 30:00 |
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)