సింహవిష్ణు | |
---|---|
Pallava King | |
పరిపాలన | 575-600 CE |
పూర్వాధికారి | Simhavarman III |
ఉత్తరాధికారి | Mahendravarman I |
వంశము | Mahendravarman I |
రాజవంశం | Pallava |
తండ్రి | Simhavarman III |
మూడవ సింహవర్మను కుమారుడు, భారతదేశంలోని పల్లవ రాజులలో ఒకరైన అవనిసింహ అని కూడా పిలువబడే సింహవిష్ణు పల్లవ రాజవంశం పునరుజ్జీవనానికి కారణమయ్యాడు. తన సామ్రాజ్యాన్ని దక్షిణాన కాంచీపురం (కాంచీ) దాటి విస్తరించిని మొదటి పల్లవ చక్రవర్తిగా ఆయన ప్రత్యేకత సంతరించుకున్నాడు. ఆయన కుమారుడు మొదటి మహేంద్రవర్మను వ్రాసిన నాటకం మాట్టవిలాస ప్రహాసనా (తాగుబోతు విలాసం) లో ఆయన గొప్ప విజేతగా చిత్రీకరించబడ్డాడు.
ఆయన తండ్రి సింహవర్మను పాలనల శిలాశాసనాలు ఆధారంగా ఆయన పాలనసాగించిన కాలం 33 సంవత్సరాలు ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.[1] సా.శ. 575-600 నుండి ఆయన పరిపాలించాడని, చోళులను జయించాడని సేను పేర్కొన్నాడు.[2] అయినప్పటికీ సింహాసనం మీద సింహవిష్ణు పాలన సాగించిన కాలం గురించి కచ్చితమైన ఏకాభిప్రాయం లేదు. ఇటీవలి ఎపిగ్రాఫికలు ఆధారాలు సా.శ. 537–570 కాలానికి మద్దతు ఇస్తున్నాయి.అయితే టి.వి.మహలింగం వంటి పాత తరం చరిత్రకారులు దీనిని కామను ఎరా 575–615 అని పేర్కొన్నారు. కె.ఎన్.ఎన్. శాస్త్రి తాత్కాలికంగా సింహావిష్ణు పాలనను కామను ఎరా 555–590 మధ్య ఉంటుందని పేర్కొన్నాడు.
సింహావిష్ణు సింహాసనాన్ని అధిరోహించిన సమయంలో పల్లవ రాజవంశం తన ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించడం ప్రారంభించింది. ఆయన తండ్రి సింహవర్మను నిష్ణాతుడైన సైనికాధికారి సా.శ. 8 వ శతాబ్దంలో రాజసింహ పల్లవ (రెండవ నరసింహవర్మను) ఇచ్చిన మంజూరు ఆధారంగా దక్కను చాళుక్యరాజు రణారసిక సైన్యాన్ని ఓడించి పట్టణాన్ని నాశనం చేశాడు.
భారతదేశం దక్షిణ ద్వీపకల్పాన్ని ఆసమయంలో ఐదు రాజవంశాలు పాలించాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశు, దక్షిణ, తూర్పు కర్ణాటక సరిహద్దులోని కొన్ని భాగాలు, శ్రీలంక మొత్తం ప్రాంతంలో అధికారాన్ని పల్లవులు, చోళులు, పాండ్యులు పంచుకున్నారు; చేరాలు కేరళను, చాళుక్యులు కర్ణాటకను నియంత్రించారు. చిన్న వయస్సు నుండే యుద్ధనైపుణ్యం, ధైర్యసాహసాలు, న్యాయనిర్ణయం, వివేకానికి ప్రసిద్ధి చెందిన సింహావిష్ణు, కళాభ్రాసులను పడగొట్టి కవేరి వరకు ఉన్న ప్రాంతాన్ని జయించాడు. అక్కడ ఆయన పాండ్యులు శ్రీలంక పాలకులను ఎదుర్కొన్నాడు.[1]
ఆయన నావికాదళాలను దండయాత్రకు పంపి మలయా, శ్రీలంకలను ఆక్రమించాడు. తరువాత సింహవిష్ణు కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని స్థాపించాడు. వారి వారసులు, సమకాలీన సామ్రాజ్యాలైన పాండ్యులు, చోళులు నౌకాదళ యాత్రలతో థాయిలాండు, లావోసు, కంబోడియా వంటి దేశాలలో అద్భుతమైన భారతీయ కళాఖండాల ద్వారా పల్లవుల ఉనికి ధ్రువీకరించబడింది. అలాగే ఆ దేశాల్లోని గ్రంథా లిపిలోని వ్రాయబడిన శాసనాలు (తమిళం, సంస్కృతం రెండూ భాషలలో వ్రాయబడిన శాసనాలు) ఇందులో పల్లవులు మొట్టమొదట ప్రత్యేకత పొందారని తెలియజేస్తున్నాయి.[3]
సింహవిష్ణు పల్లవుల పునరుజ్జీవనానికి నాయకత్వం వహించాడు. ఆయనతో ప్రారంభమయ్యే కాలం తరువాత పల్లవుల రాజవంశం గ్రేటరు పల్లవ అని పిలువబడింది. పల్లవులు, చాళుక్యుల మద్య రెండు శతాబ్దాలకు పైగా కొనసాగిన గొప్ప పోరాటం సింహావిష్ణు పాలనలో ప్రారంభమైంది.
శివ, అర్జునుల మధ్య ద్వంద్వ పోరాటం (ఆ తరువాత శివుడు అర్జునుడిని దైవిక 'పసుపత' క్షిపణి ఇచ్చి ఆశీర్వదించాడు) గురించి వ్రాసిన కిరాత అర్జనీయం అని పిలువబడే కావ్యరచన చేసిన సంస్కృత కవి భారవికి సింహావిష్ణు పోషకుడు భావిస్తున్నారు.[4] పండుగ సందర్భంగా దేవాలయాలలో ఆరాధన కోసం కొడియాట్టం నాటకాల కోసం ఇది వ్రాయబడిందని భరవి నాటకం నిర్మాణం సూచిస్తుంది. కిరతా అర్జునీయం ఈ రోజు కూడా కొడియాట్టం ప్రదర్శనలో ఒక అంశంగా ఉపయోగిస్తారు.
చాలా మంది భారతీయ చక్రవర్తుల మాదిరిగానే సింహావిష్ణువు కూడా సర్వశక్తిమంతుడైన భగవంతుడికి తాను దాసుడిని అని అంగీకరించాడు. తమిళ ప్రాంతంలోని దేవాలయాలకు గొప్పగా దానాలు ఇచ్చాడు. ఆయన తండ్రి సింహవర్మ కూడా ప్రభువు పాదాల వద్ద ముక్తిని కోరుకున్న శైవ సాధువుల తమిళ సంప్రదాయ మార్గం లోకి ప్రవేశించి ఉండవచ్చు.
పెరియపురాణంలో ఒక పల్లవ పాలకుడు (అయ్యటికలు కాదవర్కను) చిదంబరం వద్ద తమిళం వెణ్బా కవిత్వంలో భగవంతుని స్తుతిస్తూ శ్లోకాలు కూర్చి భగవంతుడికి అర్పించి ముక్తిని పొందాడు అని ప్రస్తావించబడింది. ఆలయ సరోవరంలో స్నానం చేసి తన వ్యాధి నుండి విముక్తి పొందిన తరువాత ఆయన మొదట ఆలయాన్ని బంగారంతో పూత పూసినట్లు చెప్పబడినందున ఇది సింహవర్మను అయి ఉండవచ్చని ఆధారాలు తెలియజేస్తున్నాయి.[ఆధారం చూపాలి]
రెండవ నందివర్మను ఉదయెందిరాం రాగి ఫలకాలలో సింహావిష్ణు విష్ణువు భక్తుడు. ఆయన కుమారుడు మొదటి మహేంద్రవర్మను ఒక జైనుడు కాబట్టి ఇది శైవ మతంలోకి మారడానికి ముందు అన్ని శైవ పద్ధతులను వ్యతిరేకించింది. మహాబలిపురంలోని సొగసైన పుణ్యక్షేత్రం అయిన ఆదివరహ మండపం వద్ద రాతి చెక్కడంలో సింహావిష్ణు చిత్రం చూడవచ్చు. మహాబలిపురంలోని స్మారక చిహ్నాలు, దేవాలయాలు పల్లవ రాజవంశం సాధించిన విజయాలు. అవి ఇప్పటికీ తమిళనాడులో ఉన్నాయి. సింహవిష్ణు తరువాత అతని కుమారుడు మొదటి మహేంద్రవర్మను రాజ్యాధికారం చేపట్టాడు.
సింహవిష్ణు
| ||
అంతకు ముందువారు Simhavarman III |
Pallava dynasty 537–570 |
తరువాత వారు Mahendravarman I |