సితార | |
---|---|
జననం | సితార నాయర్ 1973 జూన్ 30[1] కిలిమనూర్, కేరళ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1986 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
సితార ఒక ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. పలు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. కేరళలో జన్మించిన ఈమె మొదట్లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ద్వారా తమిళ చిత్రసీమలో ప్రవేశించి తరువాత అన్ని దక్షిణాది భాషల చిత్రాల్లో నటించింది.[2] టెలివిజన్ సీరియళ్ళలో కూడా నటించింది.
సితార కేరళ లోని కిలిమనూర్ లో పరమేశ్వరన్, వల్సల నాయర్ దంపతులకు జన్మించింది. తండ్రి విద్యుత్ శాఖలో ఇంజనీరు. తల్లి కూడా అదే శాఖలో అధికారి. ముగ్గురు సంతానంలో ఈమె పెద్దది. ఈమెకు ఇద్దరు తమ్ముళ్ళు ప్రతీష్, అభిలాష్. త్రివేండ్రంలోని వట్టప్పర లో లార్డ్స్ మౌంట్ స్కూల్లో చదువుకుంది. కిలిమనూర్ లోని శ్రీ శంకర విద్యాపీఠంలో డిగ్రీ పూర్తి చేశాడు. చదువుకుంటున్నప్పుడే మలయాళంలో కావేరి అనే సినిమాలో అవకాశం వచ్చింది.[3]
2010 లో ఆమె వివాహం జరిగింది. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణి కూడా.