సీమా సింగ్ (జననం 1990 జూన్ 11) హెలెన్, ఐటెమ్ క్వీన్ అని కూడా సుపరిచితురాలైన ఆమె, ఒక భారతీయ చలనచిత్ర నటి, నర్తకి, మోడల్, టెలివిజన్ ప్రెజెంటర్, రాజకీయవేత్త కూడా.[1] భోజ్‌పురి సినిమారంగంలో అత్యంత ప్రసిద్ధ ఐటెమ్ సాంగ్ డాన్సర్లలో ఆమె ఒకరు. ఆమె భోజ్‌పురి ఫిల్మ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది.[2][3][4]
సీమా సింగ్ 2019 మార్చి 13న బీహార్షేఖ్పురా జిల్లా బార్బిఘాకు చెందిన వ్యాపారవేత్త సౌరవ్ కుమార్ సింగ్ ను వివాహం చేసుకుంది.[5][6] వీరికి శివాయ్ అనే కుమారుడు ఉన్నాడు.[7][8]
2008లో దినేష్ లాల్ యాదవ్ నిరహువా నటించిన కహాన్ జైబా రాజా నమరీ లడై కే చిత్రంలో సీమా సింగ్ ఐటమ్ గర్ల్ గా అరంగేట్రం చేసింది.
ఆ తరువాత, ఆమె చోడాబ్ నా సాంగ్ తోహార్ (2011), హమ్ దో అంజానే (2011), హీరో (2012), హిమ్మత్వాలా (2012), దిలర్ (2013), ప్రేమ్ దివానీ (2013), రాజా బాబు (2015), విజయపథ్ (2015), హమ్ హై లూటేరే (2017), డ్రీమ్ జిందగి (2017) తదితర చిత్రాలలో ఐటెమ్ గర్ల్ గా మెప్పించింది.
వ్యాపారవేత్త అయిన తన భర్త సౌరవ్ కుమార్ సింగ్ తో కలిసి సీమా సింగ్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)లో జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సమక్షంలో 2023 ఏప్రిల్ 4న చేరింది.[9][10][11]బీహార్ ఫస్ట్ బిహారీ ఫస్ట్ అనే ఇతివృత్తం తనను ప్రభావితం చేసిందని ఆమె చెప్పింది.[12]