సీమ | |
---|---|
జననం | శాంతకుమారి 1957 మే 22 పురసవల్కం, చెన్నై, భారతదేశం |
ఇతర పేర్లు | శాంతి |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1974 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఐ.వి.శశి |
పిల్లలు | అను, అని |
తల్లిదండ్రులు | మాథవన్ నంబియార్, వసంతి |
సీమ భారతీయ సినిమా నటి.[1] ఆమె సుమారు 250 మలయాళ, తొమ్మిది తమిళ, ఏడు తెలుగు, మూడు కన్నడ, ఒక హిందీ సినిమాలో నటించింది. ఆమె ప్రస్తుతం కూడా క్రియాశీలకంగా చిత్రపరిశ్రమలో కొనసాగుతుంది.
ఆమె తమిళ చిత్రసీమలో తన 14వయేట నృత్యకారిణిగా జీవితం ప్రారంభించింది. ఆమె కథానాయకిగా జీవితాన్ని లీసా బాబీ యొక్క చిత్రం "నిఝలె నీ సాక్షి" తో ప్రారంభించింది. కానీ ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. (ఈ సినిమా తరువాత "విధుబాల" కథానాయకిగా పూర్తిచేయబడినది.) ప్రముఖ నటుడు విజయన్ ఆమెకు "నిఝలె నీ సాక్షి" చిత్ర నిర్మాణ సమయంలో "సీమ" అని నామకరణం చేసాడు.
ఆమె తన 19వ యేట మలయాళ చిత్రసీమలో మొదటి సినిమా "అవలెదు రవుకై" ద్వారా కథానాయకిగా ప్రవేశించింది. ఈ చిత్రం ఐ.వి.శశి దర్శకత్వంలో రూపొందినది.[2] ఆమె కేరళలో ప్రసిద్ధ నటుడైన జయన్ తో కలసి అనేక చిత్రాలలో నటించింది. కేరళలో ఈ జంట ప్రసిద్ధ జంటగా పేరుగాంచింది. ఆమె చిత్రసీమకు పశ్చిమాది ప్యాషన్ దుస్తులైన మినీ స్కర్ట్స్, బెల్ బోటం ప్యాంట్లు, స్లివ్ లెస్ టీ షర్టులను మలయాళ సినిమాలే ప్రవేశాపెట్టింది. ఆ కాలంలో చీర, జాకెట్టు అనే వస్త్రధారణ మాత్రమే కథానాయికలకు ఉండేది. ఆమె "మహాయానం" అనే మలయాళ సినిమాలో నటించిన తరువాత కొంతకాలం విరామం తీసుకొని 1988 వరకు నటనా ప్రస్థానాన్ని కొనసాగించింది. ఆమె మరలా 1998లో "ఒలెంపియాన్ అంటోనీ ఆడం" చిత్రం ద్వారా మరల క్రియాశీలం గా మారింది. ఆమె 1984, 1985 లలో కేరళ రాష్టృఅ ఫిలిం ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆమె జీవిత చారిత్ర పై దిదీ దామోదరన్ అనే ప్రముఖ రచయిత 2011 లో "విశుధ శాంతి" అనే పుస్తకాన్ని ప్రచురించాడు.[3] ఆమె సన్ టెలివిజన్ సీరియల్ "తంగం" లో నాచియార్ అనే ప్రసిద్ధమైన పాత్రను పోషించింది. ఆమె చెన్నై లో జరిగిన 59వ ఐడియా ఫిలింఫేర్ ఫెస్టివల్ లో జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందుకుంది.[4]
ఆమె చెన్నైలో స్థిరపడిన మలయాళీ దంపతులైన మాధవన్ నంబియార్, వాసంతి లకు చెన్నైలోని పురసవాలకం ప్రాంతంలో జన్మించింది. ఆమె తండ్రి మద్రాసులోని టి.వి.ఎస్.పార్సెల్ లో పనిచేసేవాడు. ఆయన ఆమె తల్లిని తాను 7 యేండ్ల వయసు ఉన్నప్పుడు విడాకులిచ్చాడు. ఆయన మరల వివాహమాడాడు. ఆమె తన తల్లితో పాటు ఉండి కోడంబక్కం వద్ద చూలైమేడులో పెరిగింది. ఆమెకు ఇద్దరు సవతి తమ్ముళ్ళు, ఒక సవతి చెల్లెలు ఉంది. [5] ఆమె ప్రాథమిక విద్యను చెన్నైలోని పి.ఎన్.ధావన్ ఆదర్శ విద్యాలయంలో జదివింది.[6]
ఆమెకు ప్రముఖ మలయాళ దర్శకుడు ఐ.వి.శశి తో ఆగస్టు 28, 1980లో వివాహం జరిగింది. ఆ జంటకు కుమార్తె అను, కుమారుడు అని శశి జన్మించారు.
ప్రముఖ నటుడు విజయన్ ఆమెకు చిత్ర పరిశ్రమలో "సీమ" అనే నామకరణం చేసాడు.[7]
కేరళ రాష్ట్ర చిత్ర పురస్కారాలు
ఫిలిం ఫేర్ పురస్కారాలు