సునంద శర్మ | |
---|---|
జననం | [1] ఫతేగర్ చురియన్]], పంజాబ్, భారతదేశం | 1991 జనవరి 30
జాతీయత | ఇండియన్ |
పౌరసత్వం | ఇండియన్ |
వృత్తి |
|
గుర్తించదగిన సేవలు | పటాకే (పాట), మోర్ని, శాండల్, జానీ తేరా నా, దూజీ వార్ ప్యార్, పాగల్ నహీ హోనా, బారిష్ కి జాయే" |
సంగీత ప్రస్థానం | |
లేబుళ్ళు | Mad 4 Music |
సునంద శర్మ (జననం 1991 జనవరి 30) భారతీయ నేపథ్య గాయని, సినీ నటి. ఆమె "బిల్లి అఖ్" పాటతో అరంగేట్రం చేసింది.[2] ఆమె తన నటనా జీవితాన్ని సజ్జన్ సింగ్ రంగూట్(Sajjan Singh Rangroot) చిత్రంతో ప్రారంభించింది.[3] అలాగే ఆమె బాలీవుడ్ లో "తేరే నాల్ నాచ్నా" పాటతో అడుగుపెట్టింది.[4]
సునంద శర్మ కవర్ పాటలు పాడటం, వీడియో రికార్డింగ్‌లను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది.[5][6][7] జనాదరణ పొందిన తరువాత, ఆమె తన తొలి సింగిల్ "బిల్లీ అఖ్" ను విడుదల చేసింది. 2017లో విడుదలైన ఆమె పాటలలో ఒకటైన “జానీ తేరా నా” యూట్యూబ్‌లో 334 మిలియన్లకు పైగా వీక్షించబడింది.[8]
ఆమె PTC పంజాబీ మ్యూజిక్ అవార్డ్స్‌లో ఉత్తమ తొలి మహిళా గాయకురాలిగా ఎన్నికయ్యింది.[9] 2017లో బ్రిట్ ఆసియా టీవీ మ్యూజిక్ అవార్డ్స్‌లో ఆమె బెస్ట్ ఫిమేల్ యాక్టర్ గెలుచుకుంది.[10] "బారిష్ కీ జాయే" పాట దేశం నలుమూలలా ప్రేక్షకులకు నచ్చుతోంది.[11][12] PTC పంజాబీ ఛానెల్లో ప్రసారమైన 'హునార్ పంజాబ్ డా - సీజన్ 2' షోకి యాంకర్‌గా హోస్ట్‌గా వ్యవహరించడానికి సునంద శర్మను ఆహ్వానించారు.[13][14] సునంద శర్మ భారత సంగీత పరిశ్రమ కొత్త బాస్ లేడీగా గుర్తింపుతెచ్చుకుంది.[15]