సురేష్ భట్ 1932 ఏప్రిల్ 15 జన్మించారు. మరాఠీ కవి.
సురేష్ భట్ | |
---|---|
జననం | అమరావతి, మహారాష్ట్ర | 1932 ఏప్రిల్ 15
మరణం | 2003 మార్చి 14 | (వయసు 70)
జాతీయత | భారత దేశం |
వృత్తి | కవి, గేయ రచయిత |
పిల్లలు | విశాఖ, హర్షవర్ధన, చిత్తరంజన్ |
వెబ్‌సైటు | https://www.sureshbhat.in/ |
సురేష్ భట్ మరాఠీ కవి. మరాఠీలో గజల్‌ను పరిచయం చేశాడు.అందువల్ల అతన్ని 'గజల్ చక్రవర్తి' అని పిలుస్తారు. అతను మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించాడు.అతని తండ్రి శ్రీధర్ భట్ వృత్తిరీత్యా డాక్టర్. అతని తల్లికి కవిత్వం అంటే చాలా ఇష్టం. దాని వల్ల సురేష్ భట్ చిన్న వయసులోనే మరాఠీ కవిత్వంపై ప్రేమను పెంచుకున్నాడు. సురేష్ భట్ రెండున్నర సంవత్సరాల వయసులో పోలియో బారిన పడ్డాడు. సురేష్ భట్ కు ఒక కుమార్తె విశాఖ, ఇద్దరు కుమారులు హర్షవర్ధన్, చిత్తరంజన్ ఉన్నారు. వారిలో, హర్షవర్ధన్ ఒక ప్రమాదంలో మరణించాడు.
సురేష్ భట్ విద్య అంతా అమరావతిలో జరిగింది. 1955 లో చివరి పరీక్షల్లో రెండుసార్లు విఫలమైన తర్వాత BA డిగ్రీని పొందాడు.అనంతరం బోధనా వృత్తిలోకి వచ్చారు. అమరావతి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ కవిత్వం రాయడం కొనసాగించారు.
సురేష్ భట్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన, బౌద్ధమతన్ని స్వీకరించాడు.
మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాహిత్యం లో పురస్కారాలను అందుకున్నారు.
14 మార్చి 2003 న సురేష్ భట్ గుండెపోటుతో మరణించారు. ఆయన మరణించే సరికి 70 సంవత్సరాలు.[1]